Shambhala: వర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ లేటెస్ట్ సినిమా శంబాలా. కెరీర్ ఆరంభం నుంచే డిఫరెంట్ కథా చిత్రాలు చేస్తూ వస్తున్న ఈ హీరో.. ఇప్పుడు మరో వైవిద్యభరితమైన థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ఎ మిస్టికల్ వరల్డ్ అనేది ట్యాగ్ లైన్. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజశేఖర్ అన్నభిమొజు, మహీధర్ రెడ్డి కలిసి షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, వీడియోస్ వదిలి హైప్ పెంచేసిన టీమ్.. ఈ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో శంబాలా జర్నీలో ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP భాగమైంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP ఈ చిత్రానికి సంబంధించిన నైజాం హక్కులను భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. శంబాలా యూనిట్ లో మైత్రీ వారు కూడా జాయిన్ కావడంతో సినిమాపై మరింత హైప్ పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇక శంబాలా శాటిలైట్, డిజిటల్ హక్కుల విషయానికి వస్తే.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ చిత్రానికి OTT స్ట్రీమింగ్ హక్కులను పొందగా, జీ నెట్‌వర్క్ శాటిలైట్ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పటికే ప్రకటించినట్టుగా, మూన్‌షైన్ సినిమాస్ ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో విడుదల చేయనుంది. దీంతో గ్లోబల్ లెవెల్‌లో కూడా మంచి రీచ్ అందుకోనుందని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం శంబాలా ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ డిఫరెంట్ టైప్ ప్రమోషన్స్ చేపడుతూ ఆడియన్స్‌కి ఈ సినిమాను మరింత చేరువ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా.. సూర్య 45వ చిత్రంలో భాగమైన శ్వాసిక కీలక పాత్ర పోషిస్తోంది. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో ఈ మూవీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

