తెలంగాణలో ఇన్నిరోజులు ఊరించి ఏడిపించిన వరుణుడు ఇప్పుడు దలతలిచాడు. ఉత్తర, దక్షిణ తెలంగాణలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు పంటలన్నీ వాడుపట్టిపోయాయి. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో పంటలకు ఊరట లభించనుంది. ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతున్నాయి. చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.
భారీగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ జిల్లాలోని లక్నవరం చెరువు నిండిపోయింది. లక్నవరం చెరువు టూరిస్ట్ స్పాట్ గా ఉన్న విషయం తెలిసిందే. లక్నవరం చెరువు మీద ఉన్న తీగల వంతెన పైకి నీళ్లు రావడంతో చెరువు కొత్త శోభను సంతరించుకున్నది. టూరిస్టులు జాగ్రత్తగా తీగల వంతెన మీద నడవాల్సి ఉంటుందని స్థానిక అధికారులు హెచ్చరిస్తున్నారు. లక్నవరం సోయగం తాలూకు వీడియో కింద ఉంది ఒక లుక్కేయండి.