హైదరాబాదులో మళ్ళీ కలకలం రేపుతున్న డ్రగ్స్

హైదరాబాదులో మళ్ళీ డ్రగ్స్ కలకలం రేపింది. గతేడాది సెలెబ్రిటీల డ్రగ్స్ కేసు మరువకముందే మరోసారి నగరంలో డ్రగ్స్ కేసు నమోదైంది. సిటీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పసిగట్టారు పోలీసులు. నిందితులను అరెస్టు చేశారు. వారి దగ్గర నుండి సుమారు 31 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు వివిధ కోణాలలో విచారణ నిర్వహిస్తున్నారు.

2017 లో డ్రగ్స్ కేసులో పలువురు సినీ తారలను అరెస్టు చేసి సిట్ ఎదుట విచారణ జరిపారు పోలీసులు. పెద్ద ఎత్తున విచారణ చేపట్టిన పోలీసులు ఈ డ్రగ్స్ మాఫియాతో ఎవరెవరికి సంబంధాలున్నాయి కనిపెట్టారు. అయితే కొందరు సినీ పెద్దలు, రాజకీయనాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని వార్తలు వచ్చిన పోలీసులు వారి పేర్లు వెల్లడి చేయలేదు. ముమైత్ ఖాన్, ఛార్మి, సుబ్బరాజు, పూరి జగన్నాధ్, తరుణ్, తనీష్ పలువురు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులను అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసు అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.