Actor Sriram: శ్రీను రామ్ డ్రగ్స్ కేసు వ్యవహారం.. ఆవేదన వ్యక్తం చేసిన నటుడు.. పిల్లల భవిష్యత్తు ఏంటి అంటూ!

Actor Sriram: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కోలీవుడ్ హీరో హీరో శ్రీరామ్ డ్రగ్స్ కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇటీవల హీరో శ్రీరామ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాను డ్రగ్స్ తీసుకున్నానని తప్పు చేశానని నేరాన్ని అంగీకరించారు. అంతేకాకుండా తనకు బెయిల్ మంజూరు చేయమని కోరగా అందుకు కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దండు ఈ కేసులో వచ్చే నెల వరకు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం హీరో శ్రీరామ్ రిమాండ్ లో ఉన్నారు. అయితే తన జైలుకు వెళ్లడంతో తన కుటుంబ పరిస్థితి పట్ల తాజాగా హీరో శ్రీరామ్ ఆందోళన వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. కొకైన్ వాడటం చట్టవిరుద్ధం అని నాకు తెలియదు. తెలియకుండానే నేను తప్పు చేశాను. ఇప్పుడు నన్ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. నా కొడుకు, కూతురి విద్య, భవిష్యత్తు దెబ్బతింటుందని భయపడుతున్నాను. నేను తప్పు చేసినప్పుడు.. ఇంత ప్రభావం చూపుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా కొడుకు గురించి ఆలోచించినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. నేను లేకుండా జీవించలేడు అని పోలీసులతో హీరో శ్రీరామ్ చెప్పినట్టు సమాచారం. అయితే మరి ఆయన ఆవేదనను అర్థం చేసుకున్న కోర్టు ఆయనకు బెయిల్ ను మంజూరు చేస్తుందా లేదా అన్నది చూడాలి మరి.

ఇకపోతే హీరో శ్రీరామ్ కెరియర్ విషయానికి వస్తే.. ఎలాంటి సినిమా ఇండస్ట్రీ నేపథ్యం లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2002లో వచ్చిన రోజా కూట్టం సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చి పెట్టడంతో ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయారు. కొన్ని రోజులపాటు వరుస సినిమాలతో దూసుకుపోయారు. ఆ తర్వాత ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే.. 2008లో చెన్నైకి చెందిన వందన అనే అమ్మాయిను ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.