సృష్టి పుట్టినప్పుడు భూమిపై మాతృమూర్తి జన్మించారు. అప్పటి నుంచి ఎన్నో తరాలు దశాబ్దాలు మారిన అమ్మ ప్రేమలో మాత్రం మార్పు లేదని చెప్పాలి. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని సహనం ఓర్పుతో భరించే అమ్మ ప్రేమకు ఈ భూమిపై ఏదీ సాటి లేదు. అయితే నేడు మదర్స్ డే కావడంతో ప్రతి ఒక్కరు మాతృమూర్తికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా జరుపుకుంటున్నారు.అయితే వెండితెరపై తల్లులుగా నటించి అందరిని మెప్పించిన నటీమణులు ఎవరు ఏమిటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
అలనాటి నుంచి నేటి వరకు ఎన్నో దశాబ్దాలు మారినా వెండితెరపై తల్లి పాత్రలకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ఈ క్రమంలోనే గతంలో సీతమ్మ పాత్రలో నటించాలి అంటే ఆ పాత్రకు అంజలీదేవి తప్ప మరెవరూ లేరని చెప్పవచ్చు. ఎస్.వరలక్ష్మి అంజలీదేవి, ఛాయాదేవి, సూర్యకాంతం వంటి వారందరూ ఒక తరంలో తల్లి పాత్రలలో నటించి మెప్పించారు. ఇక బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చిన తర్వాత వెండితెరపై తల్లి పాత్రలో కన్నాంబ, హేమలత, అంజలీ దేవి, సంధ్య, దేవిక వంటి వారు ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలో నటించి తల్లి పాత్రకు ప్రాణం పోశారు.
70 తర్వాత వచ్చిన కమర్షియల్ చిత్రాలలో పుష్పలత, జయంతి, శారద, కాంచన తల్లి పాత్రల్లో కనిపించే సందడి చేశారు.ఇక వెంకటేష్,నాగార్జున, చిరంజీవి వంటి హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో వీరికి తల్లి పాత్రలలో జయచిత్ర, సుజాత, శ్రీవిద్య, మంజుల, వాణిశ్రీ… వీరందరూ తల్లి పాత్రలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇక ప్రస్తుతం గ్లామర్ ఉన్న తల్లులుగా ఎంతోమంది ఇండస్ట్రీలో తల్లి పాత్రలో నటించి తల్లి పాత్రకు ప్రాణం పోస్తున్నారు. ఇలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది సుధా. సుధా గారు ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలో నటించి తల్లి పాత్ర పేరు తీసుకు వచ్చారు. అలాగే జయసుధా, ప్రగతి, శరణ్య, నదియా, తులసి, పవిత్ర లోకేష్, సుకన్య, రేవతి, రోహిణి, రమ్యకృష్ణ వంటి హీరోయిన్లు ప్రస్తుతం తల్లి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులు ఇటు సందడి చేస్తున్నారు. ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి గ్లామర్ చిత్రాల వరకు తల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన తల్లులు వీరే అని చెప్పాలి.