Anaganaga Oka Raju: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నవీన్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. జాతి రత్నాలు మూవీతో భారీగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ ఆ తర్వాత అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇది ఇలా ఉంటే చివరగా నవీన్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఇప్పుడు మరో కొత్త మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అయ్యారు హీరో నవీన్ పొలిశెట్టి. మారి దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు. ఇందులో నవీన్ హీరోగా నటిస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణం ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఇటీవల షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇకపోతే అనగనగా ఒక రాజు సినిమా 2026 సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా అనగనగా ఒక రాజు సినిమా స్పెషల్ దీపావళి ప్రోమో విడుదల చేసారు మేకర్స్. ఈ వీడియోలో నవీన్ పోలిశెట్టి దీపావళి షాప్ లో రకరకాల టపాసులు అమ్ముతున్నట్టు సరదా వీడియో చేసారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన పోస్టర్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. కాగా త్వరలోనే ఈ మూవీ నుంచి సాంగ్ కూడా విడుదల కానుంది.

