Balakrishna : తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర మంచి అగ్రెసివ్ గా కనిపించే అందులోని ఆఫ్ లైన్ లో హీరోల్లో నందమూరి వారి నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. అయితే బాలయ్య బయట ప్రవర్తన ఒక్కోసారి ఎలా ఉంటుందో తెలిసిందే. అలాగే ఒకోసారి తన మాటలు కూడా ఇతర హీరోల అభిమానులని హర్ట్ చేసేలా అనిపిస్తాయి.
సరే ఇది పక్కన పెడితే రీసెంట్ గా బాలయ్య చేసిన మాస్ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో సహా సినీ వర్గాల్లో బాగా హైలైట్ అయ్యింది. తన సినిమాల కోసం ఎవరి దగ్గరకి వెళ్ళను అర్ధించను అని అలాగే నా సినిమా బడ్జెట్ కూడా పెంచను అందుకే నాకు ఎవరిని కలవాల్సిన పని లేదు మాట్లాడాల్సిన అవసరం లేదు అని తెలిపారు.
దీనితో బాలయ్య ఓ రేంజ్ లో బీరాలు పలికి హైప్ అవ్వగా ఇపుడు ఈ స్టేట్మెంట్ పరంగా బాలయ్య బుక్ అయ్యిపోయారని చెప్పాలి. నిన్ననే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ బాలయ్య గారు తన “అఖండ” సినిమా విషయంలో నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి జగన్ గారి అపాయింట్మెంట్ కావాలని అడిగారని ఈ విషయాన్నీ జగన్ దగ్గరకి చేర్చగా
జగన్ అలాంటి వ్యక్తి మన దగ్గరకి రావడం వద్దు వారి సినిమాని వదిలెయ్యండి అన్నట్టుగా తెలిపారని నాని సంచలన నిజాలు బయటపెట్టారు. దీనితో బాలయ్య అంతటి నేనెవరి దగ్గరకి వెళ్ళను అడగను అని చెప్పి ఇప్పుడు అఖండ కోసం మాట్లాడి బేరాలు కుదుర్చుకోవడం ఏమిటి అని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
అలాగే నాని అయితే బాలయ్య అబద్దాలు చెప్పరు అనే అనుకుంటున్నాను అని కానీ మళ్ళీ ఇలా ఎందుకు అన్నారో అని నాతో మాట్లాడిన విషయాన్ని ఇప్పుడు చెబుతున్నానని తాను తెలిపారు.