Nikhil: బిగ్ బాస్ ట్రోఫీ గెలవగానే మాట మార్చేసిన నిఖిల్.. అప్పుడేమో అలా.. ఇప్పుడు ఇలా!

Nikhil: తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు షో ముగిసిన విషయం తెలిసిందే. ఆదివారం రోజున గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగగా నిఖిల్ ఈసారి సీజన్ విన్నర్ గా నిలిచారు. మొదటినుంచి ఈ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంటూ వస్తున్న నిఖిల్ ఎట్టకేలకు టైటిల్ ని గెలిచాడు. చిన్నచిన్న విషయాలకు చాలా ఎమోషనల్ అవుతూ సెన్సిటివ్ గా ఉన్న అఖిల్ హౌస్ లో ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి ఉండేవాడు అన్న విషయం తెలిసిందే. ఇక హౌస్ లో ఉన్న సమయంలోనే తాను సింగిల్ కాదని, బుల్లితెర నటి కావ్యతో ప్రేమలో ఉన్న విషయాన్ని బయట పెట్టాడు. అయితే ఎక్కడా కూడా ఆమె పేరుని ప్రస్తావించలేదు. బస్ హౌస్ కి వెళ్లక ముందు నుంచే కావ్య తో నిఖిల్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు తనే నా భార్య అని తెలిసిపోయింది.

నా అన్ని బ్రేకప్‌ లను ఆమె మర్చిపోయేలా చేసింది. మా ప్రేమకు ఆరేళ్లు. మేము విడిపోయామా? అంటే నేనైతే ఆ ఎమోషనల్‌ బంధం నుంచి బయటకు రాలేదు. భవిష్యత్తులోనూ తనతోనే కలిసుంటా.. తనే నా భార్య అని ఫిక్సయిపోయా! షో అయిపోగానే తన దగ్గరికే వెళ్తాను. ఆమె కోప్పడుతుందని తెలుసు. అయినా వెళ్తా.. తిడితే పడతాను, కొడితే కొట్టించుకుంటాను.. పిచ్చి లేస్తే లేపుకెళ్లిపోతా.. షో అయిపోగానే నీ ముందు నిలబడతా.. అంటూ కావ్యపై ఉన్న ప్రేమను చెప్తూ ఏడ్చేశాడు నిఖిల్. అయితే ఇదంతా హౌస్ లో ఉన్నప్పటి మాటలు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ అవ్వడంతో పాటు హౌస్ లో నుంచి బయటకు వచ్చిన అఖిల్ ని తాజాగా నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ యాంకర్ అర్జున్ అంబటి ఇంటర్వ్యూ చేశారు.

Bigg Boss Buzzz | Nikhil's Exclusive Exit Interview | Ambati Arjun | Star Maa

ఈ ఇంటర్వ్యూలో భాగంగా అర్జున్ మాట్లాడుతూ.. ట్రోఫీ గెలవగానే డైరెక్ట్‌గా తన దగ్గరకే వెళ్తానన్నావు.. మరి వెళ్తున్నావా? అని ప్రశ్నించగా.. నిఖిల్ స్పందిస్తూ.. బయటకు వెళ్లేదాక తెలియదు పరిస్థితి! అని చెప్పాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వెళ్తాను అంటూ బల్లగుద్ది మరి చెప్పిన నిఖిల్ ఇప్పుడు గెలవగానే ఇలా మాట మార్చడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు. హౌస్ లో నిఖిల్ సోనియా అలాగే యష్మీ లతో ప్రేమగా ఉన్న విషయాలు గుర్తుతెచ్చుకొని ఆ మాట అని ఉంటాడు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు కొంచెం ఆలస్యంగా నైనా నిఖిల్ కావ్యను కలుస్తాడేమో? ఆమె దగ్గరికి వెళ్లి మళ్లీ తన ప్రేమను నిలబెట్టుకుంటాడేమో? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.