Kriti Sanon: బాయ్‌ఫ్రెండ్‌ తో పెళ్లికి హాజరైన కృతి సనన్‌.. నెట్టింట ఫొటోస్ వైరల్!

Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ కృతిసనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉంది. ఆది పురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ను చవిచూడడంతో ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. అయినప్పటికీ ఈ సినిమాతో బాగానే అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంది.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇది ఇలా ఉంటే గత కొంతకాలంగా ఈమె ప్రేమా పిల్లి రిలేషన్షిప్ విషయాలలో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కబీర్ బహియా అనే వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల అతని బర్త్ డే సందర్భంగా కృతి చేసిన పోస్ట్‌ చూస్తే వీరిద్దరు డేటింగ్‌bలో ఉ‍న్నట్లు అర్థమవుతోంది. దీంతో కృతి సనన్‌ కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందా? అని తెగ చర్చించుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఈ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈమె ఒక పెళ్లి వేడుకలో మెరిసింది. ఆ పెళ్లి మరోవరిదో కాదు.. తన ప్రియుడు కబీర్ బహియా బంధువులదే కావడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. దీంతో వీరిద్దరి రిలేషన్‌ పై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో కృతి సనన్ పెళ్లి చేసుకోబోతోందా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ ఫోటోలపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే గతంలో కూడా వీరిద్దరూ విదేశాల్లో వెకేషన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి తరచూ జంట ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. మరి ఈ జంట వారి ప్రేమ విషయాన్ని ఎప్పుడూ అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి మరి.