Allu Arjun: అల్లు అర్జున్ పై పొగడ్తల వర్షం కురిపించిన ప్రశాంత్ వర్మ.. ఐకాన్‌ స్టార్‌ అనడానికి ఇదే నిదర్శనం అంటూ!

Allu Arjun: టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. అందుకు గల కారణం పుష్పరాజ్ అరెస్ట్ అవ్వడమే. ఆ సంగతి పక్కన పెడితే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే విడుదల అయిన ఆరు రోజులకే దాదాపుగా 1000 కోట్ల కలెక్షన్స్ను సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమాను వీక్షించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ప్రశాంత్ వర్మ స్పందిస్తూ.. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ స్క్రీన్‌ పై వైల్డ్‌ ఫైర్‌. ప్రతి సీన్‌, ప్రతి డైలాగ్‌, అన్నిరకాల ఎమోషన్స్‌ ను ఆయన అద్భుతంగా ప్రదర్శించారు. ఆయన్ని ఐకాన్‌ స్టార్‌ అనడానికి ఇదే నిదర్శనం. తన నటనతో శ్రీవల్లి పాత్రకు రష్మిక ప్రాణం పోశారు. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ చాలా బాగుంది. చిత్ర బృందంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. ఇలాంటి మాస్‌, ఐకానిక్‌ పాత్రను చిత్రీకరించిన దర్శకుడు సుకుమార్‌, దీనిని నిర్మించి భారీ స్థాయిలో విడుదల చేసిన మైత్రీ మూవీ మేకర్స్‌ కు ప్రత్యేక అభినందనలు అని ప్రశాంత్‌ వర్మ చెప్పుకొచ్చారు.

ఇకపోతే ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా పనుల్లో భాగంగా బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా 2025లో విడుదల కానుంది. ఈ సినిమాలో హనుమాన్ పాత్రలో కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించబోతున్నారు.. అలాగే ప్రశాంత్ వర్మ మరోవైపు బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞతో కూడా ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా ఇది సిద్ధం కానుంది. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.