YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి నందమూరి లక్ష్మీపార్వతికి కీలక పదవి ఇచ్చారు. దీంతో ఏపీ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యంగా వైసీపీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కోవడమే కాకుండా ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవడంతో ఈమె అప్పటినుంచి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిని తీవ్ర స్థాయిలో తప్పుపడుతూ వస్తున్నారు. ఇక ఈమె వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన తర్వాత వైకాపాలో చేరి నిత్యం తెలుగుదేశం పార్టీపై అలాగే చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు.
ఇలా నిత్యం తెలుగుదేశం పార్టీ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలలో కొనసాగుతున్న లక్ష్మీపార్వతికి తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈయన నియమించారు.ఈ అంశంపై ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికర అంశంగా మారింది. చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా జగన్ ఈ నియామకం చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల ముందు సైతం లక్ష్మీపార్వతి వైసీపీలో కీలక పాత్ర పోషించారు.
అవకాశం వచ్చిన ప్రతిసారి లక్ష్మీపార్వతి చంద్రబాబు పై నిప్పులు చెరిగారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను తెలుగు అకాడమీ చైర్మన్ గా నామినేటెడ్ పదవిని కట్టబెట్టారు. ఇక కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరుని పెట్టడం ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైయస్సార్ పేరును పెట్టినప్పుడు కూడా ఈమె ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. దీంతో ఎంతో మంది నందమూరి తెలుగుదేశం అభిమానులు ఈమె ధోరణిని తప్పు పట్టారు.
ఈ నేపథ్యంలో మరోసారి ఆమెకు పార్టీలో మరోసారి ప్రాధాన్యత కలిగిన పోస్టును అందించారు. ఇక ఈ పదవి అందుకోవడంతో ఈమె చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీపై మరిన్ని విమర్శలు కురిపించే అవకాశాలు లేకపోలేదు. అయితే ఈ విషయంలో జగన్ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారని గతంలో ఇలా చేయటం వల్లే ఈసారి ఎన్నికలలో ఆయనకు కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయని ఇందుకు జగన్ ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోలేకపోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.