బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, ఒకప్పటి నెంబర్ 1 ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తీవ్ర చర్యలు తీసుకుంది. అతడి బౌలింగ్ యాక్షన్ ఐసిసి నిబంధనలకు విరుద్ధమని నిర్ధారించిన అనంతరం, అన్ని ఫార్మాట్లతో పాటు ఇతర దేశాల లీగ్‌లలోనూ బౌలింగ్ చేయకుండా నిషేధం విధించింది.
ఇటీవలే షకీబ్ యాక్షన్‌పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ఫిర్యాదు తీసుకుని, ప్రత్యేక టెస్ట్ నిర్వహించింది. ఈ పరీక్షలో షకీబ్ మోచేయి 15 డిగ్రీల నిబంధనకు విరుద్ధంగా వంగినట్టు తేలింది. ఈ నివేదిక ఆధారంగా మొదట ఇసిబి అతడిపై చర్యలు తీసుకోగా, తర్వాత ఐసిసి కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేసింది. దీంతో షకీబ్‌కు బౌలింగ్ అనుమతిని పూర్తిగా నిలిపివేయడం జరిగింది.
ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పందిస్తూ, షకీబ్ ఐసిసి నిబంధనల ప్రకారం బౌలింగ్ చేయడానికి అనర్హుడని పేర్కొంది. ఇది దేశీయ క్రికెట్‌ను కూడా ప్రభావితం చేస్తుందని వెల్లడించింది. అయితే, అతడు బ్యాటింగ్ చేయడానికి మాత్రం అనుమతిస్తారు.
షకీబ్ అల్ హసన్, ఆల్ రౌండర్‌గా అత్యుత్తమ ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాడు. 71 టెస్టుల్లో 4,609 పరుగులు చేయడమే కాకుండా, 246 వికెట్లను తీసుకున్నాడు. వన్డేల్లో 7,570 పరుగులతో పాటు 317 వికెట్లు, టీ20ల్లో 2,551 పరుగులతో 149 వికెట్లు తీశాడు. ఈ చర్యతో షకీబ్ కెరీర్‌పై మసకబారిన సందేహాలు వ్యక్తమవుతున్నాయి.