ది రేజ్ ఆఫ్ డాకు సాంగ్ రిలీజ్.. మళ్లీ పూనకాలు ఖాయమంటున్న ఫ్యాన్స్!

నందమూరి నట సింహం డాకు మహారాజ్ గా సంక్రాంతికి మన ముందుకు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండటంతో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జోరు పెంచారు మూవీ మేకర్స్.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, టైటిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల సైతం ఈ సినిమా చూడాలని ఆసక్తి రోజుకి పెరిగిపోతుంది.

ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఇప్పుడు ఈ చిత్ర పాటలు పండుగ మొదలైంది. తాజాగా ఈ చిత్రం నుంచి ది రేజ్ ఆఫ్ డాకు పేరుతో మొదటి గీతం విడుదలైంది. బాలకృష్ణ తమన్ కలియక ఎంత ఊపు ఇస్తుందో అందరికీ తెలిసిందే. బాలకృష్ణ గత మూడు చిత్రాలకు సంగీతాన్ని అందించిన తమన్ మరొకసారి తన మార్కు మ్యూజిక్ రుచి చూపించాడు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ పాటను అద్భుతంగా స్వరపరిచారు.

హీరో పాత్ర తీరు తెన్నులను తెలియజేసేలాగా అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు రచయిత అనంత శ్రీరామ్. భరత్ రాజ్,నకాష్ అజీజ్, రితేష్ జి రావు కే ప్రణతి తమ గాత్రంతో ఈ పాటకి మరింత అందం తీసుకొచ్చారు. ఈ పాట విజువల్ గా చాలా అద్భుతంగా ఉంది, ప్రతి ఫ్రేమ్ లోని భారీతనం కనిపిస్తుంది. భార్య యాక్షన్ సీన్స్ బలమైన భావోద్వేగాలతో ఈ సినిమా ఉండబోతుందని వీడియో చూస్తే అర్థమవుతుంది.

లిరికల్ వీడియోలో బాలకృష్ణ మునిపెన్నడు కనిపించని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక కథానాయకులుగా ప్రజ్ఞ జైష్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా విజయ్ కార్తీక్ కన్నన్, సమర్పణ శ్రీకర స్టూడియోస్, కళాదర్శికుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమనే వ్యవహరిస్తున్నారు.