ఇంట్లో దరిద్రం పోయి ధనలక్ష్మి రావాలా.. పాటించాల్సిన క్రేజీ చిట్కాలివే!

మనలో చాలామంది ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రావడం లేదని చెబుతూ ఉంటారు. మనపై లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మాత్రం జీవితాంతం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇళ్లల్లోని మహిళలు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, ఇంటిముందు ఊడ్చి, శుభ్రపరిచి ముగ్గు వేసి, ఇంట్లో పూజ నిర్వహిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉదయాన్నే నిద్ర లేకపోవడం, ఇల్లు శుభ్రం చేసుకోకపోవడం దరిద్రానికి ప్రధాన కారణమని, అటువంటి ఇళ్ళల్లో లక్ష్మీ కటాక్షం ఉండదని పండితులు చెబుతున్నారు.

ఎవరి ఇంట్లో అయితే బూజు ఎక్కువగా ఉంటుందో అలాంటి కుటుంబాలను సైతం దరిద్ర దేవత పట్టి పీడిస్తుంది. ఇల్లు శుభ్రంగా ఉండాలని, ఇంట్లో ఇల్లాలు కూడా శుభ్రంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. ఇళ్లలో పాత దుస్తులను, చిరిగిన దుస్తులను ధరిస్తే వాళ్ల ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదని చెప్పవచ్చు. తెగిన చెప్పులను ఎక్కువగా ధరించినా దరిద్రం వెంటాడే అవకాశాలు అయితే ఉంటాయి.

ఇతరుల చెప్పులను వాడితే కూడా దరిద్రం వెంటాడుతుంది. భోజనం చేసే ప్లేట్ అటూఇటూ కదులుతూ ఉంటే కూడా అలాంటి ఇంటిని దరిద్రం వెంటాడే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. తిన్న పళ్ళెంలో చెయ్యి కడగటం కూడా దరిద్రం అని పండితులు వెల్లడిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇంటి నుంచి దరిద్రం పోతుందని కచ్చితంగా చెప్పవచ్చు.

మంచంపై కూర్చుని కాళ్లు ఊపడం, పూజగదిలో అనవసరమైన వస్తువులు పెట్టడం వల్ల కూడా చెడు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ క్రేజీ చిట్కాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ చిట్కాలను పాటించిన వాళ్లు సులువుగా ధనవంతులు అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.