Kichcha Sudeep: కన్నడ నటుడు, హీరో కిచ్చా సుదీప్ కన్నడ బిగ్ బాస్ రియాల్టీ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా పదేళ్లుగా విజయవంతంగా హోస్టింగ్ చేస్తూనే వస్తున్నారు. ఇప్పటికే పది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది కన్నడ బిగ్ బాస్ షో. ఇక 11వ సీజన్ నడుస్తుండగా ఈ సీజన్ కి కూడా సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ షో కి, అలాగే రాబోయే సీజన్స్‌కు తాను హోస్ట్‌గా చేయనని, ఇదే తన చివరి బిగ్‌బాస్ సీజన్ అని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఈ ట్వీట్ పై నెగటివ్ కామెంట్స్ తో పాటు పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే తాజాగా సుదీప్ ఆ ట్వీట్ చేయడం వెనుక ఉన్న కారణాన్ని బయట పెట్టారు. ఒక ఇంటర్వ్యూలో సుదీప్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ కు గుడ్ బై చెప్తున్నానంటూ ట్వీట్ చేసిన రోజు చాలా అలిసిపోయి ఉన్నాను. అప్పుడు నా మనసుకు అనిపించింది చెప్పాను. అంతర్గత లోటు పాట్లు కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం. ఆరోజు గనక ఆ ట్వీట్ చేయకపోయుంటే తర్వాత నా ఆలోచనలు, అభిప్రాయాలు మారేవేమో. అందుకే నాకు బిగ్‌బాస్‌ను వదిలేయాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ట్వీట్ చేశాను. ఆ మాటపై ఉండాలని నాకు నేను చెప్పుకున్నాను. కొన్నిసార్లు నా చుట్టూ ఉన్న ప్రతిఒక్కరి కోసం నేను కష్టపడాల్సిన పనిలేదనిపించింది.
అక్కడ ఎంత కష్టపడ్డా పెద్దగా ఫలితం ఉండట్లేదు, అలాంటప్పుడు అంతే శ్రమ నా సినిమాలపై పెట్టుంటే బాగుండనిపించింది. అయితే మిగతా భాషల్లో బిగ్‌బాస్ కు వచ్చిన గుర్తింపు, ఆదరణ కన్నడ బిగ్‌బాస్ కు రావట్లేదు. మిగతా షోలతో మా షోను పోల్చి చూస్తే దీనికి మరింత గౌరవం రావాలి అని చెప్పుకొచ్చాడు సుదీప్. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే సుదీప్ విషయానికి వస్తే ఆయన నటించిన తాజా చిత్రం మ్యాక్స్. ఈ సినిమా క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఈ విషయంపై స్పందించారు.