గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న ‘డాకు మహారాజ్‌’

బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘డాకు మహారాజ్‌’. ఎన్‌బీకే 109గా వస్తోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమోను విడుదల చేశారు.

డేగ డేగ డేగ.. అంటూ సాగుతున్న ప్రోమో గూస్‌ బంప్స్‌ తెప్పిస్తోంది. అనంత్‌ శ్రీరామ్‌ రాసిన ఈ పాటను నకాశ్‌ అజీజ్‌ పాడాడు. బాలకృష్ణ గండ్రగొడ్డుళ్లు పట్టుకొని సమరంలో ఉన్న లుక్‌ ఇప్పటికే నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్‌ డ్యాన్సింగ్‌ క్వీన్‌ ఊర్వశి రౌతేలా, శ్రద్దా శ్రీనాథ్‌ ఫీమేల్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తుండగా.. బాబీ డియోల్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రగ్యాజైశ్వాల్‌, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.