Atlee Kumar: షోలో అట్లీని దారుణంగా అవమానించిన హోస్ట్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!

Atlee Kumar: తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి మనందరికీ తెలిసిందే. జవాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు అట్లీ. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. అయితే ఈ సినిమా కంటే ముందు అట్లీ కొన్ని సినిమాలు చేసినప్పటికీ డైరెక్టర్ గా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నది జవాన్ సినిమాతోనే అని చెప్పాలి. ఈ సినిమాతో భారీగా క్రేజ్ ని ఏర్పరచుకోవడంతో పాటు స్టార్ డైరెక్టర్ అనే హోదాను కూడా సంపాదించుకున్నారు. ఇకపోతే అట్లీ నిర్మతగా వ్యవహరిస్తున్న సినిమా బేబీ జాన్. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా అట్లీ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్నారు. అయితే ఈ షోలో అట్లీ లుక్స్ గురించి, ఆయన రూపం గురించి చాలా దారుణంగా మాట్లాడారు కపిల్. దాంతో కపిల్ కి దిమ్మతిరిగే రేంజ్ లో రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు అట్లీ. ఈ సందర్భంగా కపిల్ మాట్లాడుతూ. మీరు కథ చెప్పడానికి ఏ స్టార్ దగ్గరికి అయినా వెళ్లినప్పుడు.. మిమ్మల్ని చూసి డైరెక్టర్ ఎవరు అని అడుగుతారా అని కపిల్ అడగగా.. అట్లీ స్పందిస్తూ.. మీరు నన్ను ఈ ప్రశ్న ఎందుకు అడిగారో నాకు తెలుసు. దీనికి నేను ఒకటే సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను. మనలో టాలెంట్ ఉంటే మనం ఎలా ఉన్నామన్నది అనవసరం. దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. నిజానికి నేను.. నన్ను నమ్మిన మురుగదాస్ సర్ కి థాంక్స్ చెప్పాలి.

ఆయనకి నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన నా టాలెంట్ చూసారు తప్ప నేను ఎలా ఉన్నానో చూడలేదు. నాపై ఉన్న నమ్మకంతో నా సినిమాను నిర్మించారు. కాబట్టి ప్రపంచం కూడా మనలో ఉన్న మన టాలెంట్ నే చూడాలి. మనం ఎలా ఉన్నది కాదు. రూపాన్ని బట్టి మనిషిని కాదు అంటూ కపిల్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాగా బుద్ధి చెప్పారు. మీరు చెప్పింది నిజమే మనిషి టాలెంట్ చూడాలి రూపం కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.