YS Jagan: చంద్రబాబుది పబ్లిసిటీ స్టంట్ మాత్రమే.. విజన్ 2047 పై జగన్ సంచలన ట్వీట్!

YS Jagan: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల విజన్ 2047 పేరిట ఒక డాక్యుమెంట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు విజన్ 2047 పేరుతో మరో పబ్లిక్ సిటీ స్టాండ్ చేస్తున్నారని ఈయన ఎద్దేవా చేశారు.

చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టి మాయ చేసేందుకు ఇదొక మార్గాన్ని ఎంచుకున్నారని జగన్ తెలిపారు.చంద్రబాబుని విమర్శిస్తూ, ఆయన మేనిఫెస్టో హామీల అమలు గురించి ఎలాంటి కట్టుబడి లేకుండా ఉంటారని జాగ్రత్తలు సూచించారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రజలను మోసం చేయడం పైన ధ్యాస పెడతారని మండిపడ్డారు. 1998లో చంద్రబాబు విజన్-2020 పేరుతో ఒక డాక్యుమెంట్ విడుదల చేసిన విషయం గుర్తు చేశారు.

ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక విపరీతమైన పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు, ఉపాధి లేని కష్టాలు, వలసలు, ఉపాధి లేకపోవడం వంటివి తీవ్రతరం అయ్యాయి. అయితే, చంద్రబాబు ఆ విపరీతాలను దాచిపోయి తన విజన్ 20-20 ప్రచారాన్ని మాత్రం పీక్స్ వరకు తీసుకువెళ్లారని జగన్ తెలిపారు. ఆ సమయంలో ఈయన ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని జగన్ గుర్తు చేశారు.

అవినీతిని ప్రోత్సహించడం కూడా ఆయన ఆరోపణలలో భాగంగా ఉందని జగన్ తెలిపారు. అదేవిధంగా, స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి పాస్కల్ 1998లో హైదరాబాద్ వచ్చినప్పుడు, ఇలా అబద్ధాలు చెప్పేవారిని భారతదేశంలో జైలుకి పంపించాలనే వ్యాఖ్యానించారు. కానీ ప్రజలెవరు కూడా విజన్ 2020 ను నమ్మలేదని చంద్రబాబు నాయుడు అంటే 420 అని మాత్రమే నమ్మారు అంటూ జగన్ ఈ సందర్భంగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.