నువ్వు నాలో స్ఫూర్తిని నింపావు : రానాకు సమంత బర్త్‌డే విషేస్‌!

రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయనకు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే సమయంలో సినీ సెలబ్రిటీలు సైతం రానాకు విషెస్‌ తెలుపుతున్నారు. ఈ క్రమంలో స్టార్‌ నటి సమంత సైతం రానాకు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు.

‘హ్యాపీ బర్త్‌ డే రానా. నువ్వు చేసే ప్రతి పనిలోనూ వంద శాతం ఫోకస్‌ పెడుతుంటావు. ఈ విషయంలో నీ నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. నేను ఎప్పటికీ నీ అభిమానినే. దేవుడు ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉండాలి’ అంటూ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు.

ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. కాగా, రానా ప్రస్తుతం సరికొత్త టాక్‌ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘నం1 యారి’ అంటూ ఓటీటీలో సందడి చేసిన రానా.. ఇప్పుడు ‘ది రానా దగ్గుబాటి షో’ అనే పేరుతో అభిమానులను అలరిస్తున్నాడు. ఈ షో ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో నవంబర్‌ 23 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.