Kannappa Movie: టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కోట్ల బడ్జెట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో స్టార్ సెలబ్రిటీలు నటిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేస్తూ ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి చాలా అప్డేట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.
మూవీ నుంచి విడుదలైన ఒక్కొక్క అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరొక అప్డేట్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. అదేమిటంటే.. ఈ చిత్రంలో నటిస్తున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. కాగా ఈ చిత్రంలో మోహన్ లాల్ కిరాటా పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ సైతం నటిస్తున్న విషయం తెలిసిందే.
‘KIRATA’! The legend Sri. Mohanlal in #Kannappa. I had the honor of sharing the screen space with one of the greatest Actor of our time. This entire sequence will be 💣💣💣💣💣 ! @Mohanlal pic.twitter.com/q9imkDZIxz
— Vishnu Manchu (@iVishnuManchu) December 16, 2024
ఒక యదార్థ కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25,2025లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి అక్షయ్ కుమార్ ప్రభాస్, వంటి స్టార్ల లుక్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇవి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఈ సినిమా కోసం మంచు అభిమానులతో పాటు ప్రభాస్ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి భారీ అంచేనాల నడుమ విడుదల కాబోతున్న సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి .