Game changer: తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కోట్ల బడ్జెట్ నిర్మితమైన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు మూవీ మేకర్స్. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని రకాల పాటలు, పోస్టర్ లు విడుదల చేసిన విషయం తెలిసిందే. సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఇది ఇలా ఉంటే తాజాగా తమన్ ఈ సినిమా గురించి ఈ సినిమాలో పాటల గురించి చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గేమ్ చేంజర్ డోప్ పాట మీద తమన్ ముందు నుంచి హైప్ పెంచుతూనే వస్తున్నాడు.
ఈ పాట కోసం కొత్తగా రికార్డ్ చేశామని, ఇంగ్లీష్ వర్షె న్‌లో ఈ పాట ఉంటుందని అన్నాడు. యూఎస్‌లో జరిగే ఈవెంట్ లో ఈ పాటను రిలీజ్ చేస్తారని ఇది వరకు తమన్ తెలిపారు. అయితే ఇప్పుడు తమన్ మళ్లీ డ్యూటీ ఎక్కేశాడు. డోప్ పాట గురించి ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. డిసెంబర్ 21న ఈ పాటను రిలీజ్ చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గేమ్ చేంజర్ మూవీకి ప్రస్తుతం ఉన్న హైప్ ను మరింత పెంచేలా ఏదైనా ఒక అప్డేట్ రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తమన్ గేమ్ చేంజర్ మూడో పాట గురించి ట్వీట్ వేశాడు. డోప్ అనే పాట రాబోతోందని, ఇది సౌండ్ చేంజర్ అవుతుందని, ఈ పాట గురించి ప్రపంచం మాట్లాడుకుంటుందని హైప్ పెంచేశాడు. ఇక ఈ పాటను రాసిన రామజోగయ్య శాస్త్రి సైతం స్పందించాడు. ఈ పాట వినడానికి, చూడటానికి రెండు కళ్లు చాలవని, శంకర్ అద్భుతంగా విజువలైజ్ చేశాడని అన్నారు.