Infused Water: వేసవికాలంలో ఈ నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!

Infused Water: సాధారణంగా వేసవికాలం అంటేనే ఆరోగ్య సమస్యలు. వేసవి కాలంలో సూర్యుడి ప్రతాపం వల్ల చాలామంది ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల నుండి రక్షించుకోవడానికి చాలామంది అనేక పద్ధతులను పాటిస్తుంటారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి రక రకాల పానీయాలు, కూల్ డ్రింక్స్, మజ్జిగ వంటివి తాగటానికి ఆసక్తి చూపుతారు. కానీ వేసవి కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి పాటిస్తున్న కొత్త పద్ధతి
ఇన్ ఫ్యూజ్డ్ వాటర్. దీనిని ఫ్లేవర్డ్ వాటర్,డిటాక్స్ వాటర్ , స్పావాటర్ అని కూడా అంటారు.

సాధారణంగా వేసవికాలంలో ఆరోగ్యం రక్షించుకోవడానికి కూరగాయలు, పండ్లు జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు. అలా కాకుండా వాటిని నీటిలో నానబెట్టి తాగటం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా అనేక రకాల పండ్లు కూరగాయలను నానబెట్టిన నీటినే ఇన్ ఫ్యూజ్డ్ వాటర్ లేదా ఫ్లేవర్డ్ వాటర్ అని కూడా అంటారు. వేసవి కాలంలో ఈ ఇన్ ఫ్యూజ్ వాటర్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

వేసవికాలంలో ఈ ఇన్ ఫ్యూజ్ వాటర్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గించి శరీరం డీహైడ్రేషన్ బారినపడకుండా కాపాడతాయి. ఈ నీటిని తాగటం వల్ల శరీరానికి కావాల్సిన తక్షణ శక్తి లభించి ఈ రోజంతా హుషారు గా ఉండేలా చేస్తాయి. ఈ ఇన్ ఫ్యూజ్ వాటర్ లో అనేక రకాల పండ్లు ఉండటంవల్ల ఇందులో చక్కెర స్థాయిలు తక్కువ మొత్తంలో ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధ పడేవారు కూడా ఎటువంటి సంకోచం లేకుండా ఈ నీటిని తాగవచ్చు.

వేసవికాలంలో సంభవించే జీర్ణక్రియ సమస్యలు కూడా ఈ నీటిని తాగటం వల్ల తగ్గుతాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి మెటబాలిజం మెరుగుపడేలా చేస్తాయి. అంతే కాదనకుండా అధిక ఉష్ణోగ్రతల కారణంగా వచ్చే వడదెబ్బ, డీహైడ్రేషన్, కళ్ళు తిరగటం వంటి సమస్యలు కూడా దరిచేరవు. ఈ నీటిలో అనేక రకాల పండ్లు కలపటం వల్ల ఆ పండ్లలోని అనేక రకాల పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు మన శరీరానికి అంది రోజు మొత్తం ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో పిహెచ్ లెవెల్స్ బ్యాలన్స్ అవుతాయి.