ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న జగన్.. ఫలితం అనుభవించాల్సిందే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ముఖ్యంగా జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు సంతృప్తితో లేరు. ఏపీ టీచర్ల విషయంలో జగన్ సర్కార్ మరీ కఠినంగా వ్యవహరిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ నిర్ణయాల వల్ల ప్రైవేట్ పాఠశాలల యజమానులు సైతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

సిమ్స్ ఏపీ అనే అప్లికేషన్ ద్వారా ఏపీ ప్రభుత్వ పాఠశాలల టీచర్లు అటెండెన్స్ వేయించుకోవాల్సి ఉంది. సిమ్స్ ఏపీ యాప్ వల్ల స్కూల్ టీచర్లు ఏదైనా కారణం వల్ల పాఠశాలకు ఆలస్యంగా వచ్చినా డ్యూటీకి రానట్టుగానే నమోదై వేతనం కట్ అవుతుంది. టీచర్లలో ఎక్కువమంది పట్టణాల్లో స్థిరపడి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా ప్రయాణాలు చేస్తూ టీచింగ్ చేస్తున్నారు. ఈ నిబంధన వల్ల ఇలాంటి టీచర్లకు మరిన్ని ఇబ్బందులు తప్పవు.

కొంతమంది టీచర్లకు స్మార్ట్ ఫోన్ పై అవగాహన ఉన్నా స్మార్ట్ ఫోన్ గురించి అవగాహన లేని టీచర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. జగన్ సర్కార్ నిర్ణయం వల్ల వీళ్లకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం పొమ్మనలేక పొగబెడుతోందని ఉపాధ్యాయుల బాధలను ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు 2024 ఎన్నికల్లో ఫలితం అనుభవించాల్సి వస్తుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు ప్రైవేట్ స్కూల్స్ లో 25 శాతం సీట్లు నిరుపేదలకు చెందే విధంగా జగన్ సర్కార్ నిబంధనలను అమలు చేస్తోంది. ఈ నిర్ణయం వల్ల ప్రైవేట్ పాఠశాలలపై ఆర్థిక భారం పెరుగుతుంది. మిగిలిన 75 శాతం మంది పిల్లలపై ఆ ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది. జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలలో మెజారిటీ నిర్ణయాలపై ప్రజల నుంచి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.