Black Raisin: శీతాకాలంలో నల్లఎండు ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Black Raisin: శీతాకాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి . శీతాకాలంలో దగ్గు జలుబు జ్వరం గొంతునొప్పి వంటి సీజనల్ వ్యాధులు తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి . శీతాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. శీతాకాలంలో నల్ల ఎండు ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం .

నల్ల ఎండుద్రాక్షలో ఐరన్, క్యాల్షియం ,పొటాషియం మెగ్నీషియం,సోడియం, ఫైబర్, పిండిపదార్థాలు , విటమిన్స్ వంటి ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉన్నాయి . శీతాకాలంలో బ్లాక్ రైసిన్ తీసుకోవటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి .

ప్రతిరోజు నల్ల ఎండు ద్రాక్ష తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.నల్ల ఎండు ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం,జీర్ణ సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.నల్ల ఎండు ద్రాక్ష ప్రతిరోజు తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉండి ఎక్కువ ఆకలి అనిపించదు.. తద్వారా అధిక బరువు సమస్యను కూడా అధిగమించవచ్చు .

నల్ల ఎండు ద్రాక్షను ప్రతి రోజు తినడం వల్ల బోలు ఎముకల వ్యాధి నయం చేస్తుంది.నల్ల ఎండుద్రాక్షలో బోరాన్ ఉంటుంది. ఇది ఎముకల అభివృద్ధికి ప్రసిద్ధి చెందింది. నల్ల ఎండుద్రాక్షలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు దూరంగా ఉండేలా చేస్తుంది .

ప్రతిరోజు నల్ల ఎండు ద్రాక్ష తినటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది . హై బీపీ సమస్యతో బాధపడేవారికి కూడా ఈ ఎండు ద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఎండుద్రాక్షలను ప్రతిరోజు రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం తినడం వల్ల నల్ల ఎండు ద్రాక్ష లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఇంకా ఎక్కువ పెరిగి వ్యాధులు దరిచేరకుండా చేస్తుంది .