Health Tips:మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు మనం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.అందరికి ఆరోగ్యం మీద శ్రద్ద పెరిగి కరోనా వచ్చినప్పటినుండి ఎక్కువగా గుడ్లను తినడం అలవరచుకుంటారు. గుడ్డులో అధిక మోతాదులో పోషకాలు, ఇంకా విటమిన్ ఏ, సి, డి లతో పాటు ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. గవర్నమెంట్ కూడా రోజు గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అని ప్రజలలో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఫలితంగా రోజు రోజుకు గుడ్డు తినే వారి సంఖ్య పెరుగుతోంది. గరిష్ట ఆరోగ్య ప్రయోజనాల కోసం రోజు గుడ్డు తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే దీనిని తినవచ్చా లేదా అని డయాబెటిక్ రోగులలో అనేక అనుమానాలు ఉంటాయి. నిజానికి డయాబెటిక్ వ్యాధి గ్రస్తులు హై ప్రోటీన్ ఉండే ఆహారం తినడానికి ఆలోచిస్తారు. మధుమేహ రోగులు తిండి విషయంలో అనేక జాగ్రత్తలు వహిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోకపోతే అది శరీరంలోని ఇతర అవయవాల మీద ప్రభావం చూపి గుండె సంబంధిత వ్యాధులు, మూత్ర పిండాల వైఫల్యం, ఇతర అవయవాల వైఫల్యం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు సంభవించే ప్రమాదం ఉంది. సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆకలి ఎక్కువ వేస్తుంది. సమయానికి ఏదైనా తినకుంటే వారి శరీరంలో షుగర్ లెవెల్స్ పడిపోతాయి, కాబట్టి అత్యవసర పరిస్థితులలో ఆకలి తీర్చుకోవడానికి పండ్లు, గింజలు వంటివి దగ్గర పెట్టుకోవడం అవసరం. ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు తినటం వల్ల శరీరానికి పీచుపదార్థం ఎక్కువ లభించి షుగర్ నియంత్రణలో ఉంచుతుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులు గుడ్డు తినాలా వద్దా అని సందేహం సరిపెట్టుకోవాల్సిన పనిలేదు. షుగర్ వ్యాధిగ్రస్తులు లో షుగర్ లేదా హై షుగర్ సమస్యతో బాధపడుతుంటే ఎక్కువ ప్రోటీన్లు లభించే గుడ్లు తినడం ఎంతో శ్రేయస్కరం. గుడ్లలో ఉండే ప్రోటీన్స్ రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒక పరిశోధన ప్రకారం…. 2011 సంవత్సరంలో బ్రిటిష్ జనరల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం… టైప్ 2 డయాబెటీస్ తో బాధపడేవారు రోజు గుడ్డు తినడం వల్ల వారి కొలెస్ట్రాల్ తగ్గుదల కనిపించింది, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్ లో మెరుగుదల కనిపించింది అని తెలిపారు. ఏదైనా మితంగా తింటే ఆరోగ్యం… అమితంగా తింటే అనారోగ్యం. షుగర్ వ్యాధి గ్రస్తులు మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండటం మంచిది.