కొబ్బరి నూనెతో దేవుళ్లను పూజిస్తే కలిగే శుభ ఫలితాలు మీకు తెలుసా?

మనలో చాలామంది దేవుళ్లను పూజించినా కొన్నిసార్లు శుభ ఫలితాలు కలగవు. ఈ విధంగా అనుకూల ఫలితాలు కలగకపోవడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. అయితే కొబ్బరి నూనెతో దైవారాధాన చేయడం వల్ల అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. కాశీలో విశ్వేశ్వర స్వామిని పూజించే వాళ్లకు కోరుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

సాయంత్రం సమయంలో హరిద్వార్ లో కొబ్బరి నూనెతో గంగా దీపంను వెలిగించిన వాళ్లకు శుభ ఫలితాలు కలుగుతాయి. కొబ్బరి నూనెతో వెంకటేశ్వర స్వామిని దీపారాధన చేసి పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు అయితే తగ్గుతాయని చెప్పవచ్చు. పితృ దేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం వల్ల మరింత మంచి ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

కొబ్బరినూనెతో మహాలక్ష్మిని పూజించడం వల్ల పూజించిన వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మహాలక్ష్మీదేవిని 40 రోజుల పాటు పూజించడం వల్ల సులభంగా అప్పులు వసూలు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కుజ దోషంతో బాధ పడుతున్న వాళ్లు మంగళ, శుక్ర వారాలలో దీపాలను వెలిగించి బొబ్బట్లను ముత్తైదువులకు దానం ఇస్తే త్వరగా వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి.

కొబ్బరినూనెతో దీపారాధన చేయడం వల్ల ఫ్యామిలీలో శుభకార్యాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. రావిచెట్టు కింద ఉండే నాగదేవతల విగ్రహాలను పూజించే సమయంలో దీపారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొబ్బరినూనెతో దీపారాధాన చేసేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిది.