మనలో చాలామంది ఎక్కువకాలం జీవించాలని ఆశ పడుతూ ఉంటారు. పోషకాహారం, వ్యాయామం, మంచి నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం మరియు ధూమపానం, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం ద్వారా సులువుగానే ఆయుష్షును పెంచుకోవచ్చు. ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు, గింజలు, నట్స్, విత్తనాలు, తృణధాన్యాలు, పాలు, పెరుగు తినడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.
ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అధికంగా నూనె, కొవ్వు, ఉప్పు, పంచదార ఉండే ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డ్యాన్సింగ్, యోగా, నడక, పరుగు వంటివి కూడా ఆరోగ్యానికి మంచివి.
ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి ఎన్నో లాభాలను చేకూరుస్తాయి. నిద్రకు ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వంటివి వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. యోగా, ధ్యానం, సంగీతం వినడం, ప్రకృతిలో గడపడం వంటివి చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మిత్రులతో, బంధువులతో సమయం గడపడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చు.
ధూమపానం, మద్యపానం వంటివి చేయడం కూడా ఆరోగ్యానికి మేలు చేకూర్చదు. మత్తు పదార్ధాలకు దూరంగా ఉండటం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శారీరక వ్యాయామం వల్ల వృద్ధాప్య ప్రభావాలు తగ్గిపోతాయి. ప్రతిరోజూ 40 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా పురుషులు, మహిళలకు వృద్ధాప్యం త్వరగా వచ్చే అవకాశాలు తగ్గుతాయి.