మటన్ లివర్ ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఇది తింటే ఏకంగా ఇంత ప్రమాదమా?

మనలో చాలామంది మటన్ లివర్ ఇష్టంగా తింటారు. మటన్ లివర్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చాలామంది భావిస్తారు. ఆదివారం రోజున చికెన్, మటన్ షాపులు ఏ రేంజ్ లో బిజీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు మటన్ బిర్యానీ ఖరీదు అయితే ఇష్టంగా తినేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అయితే మటన్ లివర్ తినడం వల్ల కొన్ని లాభాలు ఉంటే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

మటన్ లివర్ తినడం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్ లభించే అవకాశాలు ఉంటాయి. రక్తహీనతకు చెక్ పెట్టడంలో మటన్ లివర్ సహాయపడుతుంది. మటన్ లివర్‌లో ఉండే విటమిన్-ఎ కళ్లు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. ఇది తినేవళ్లకు కళ్ల సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు. మటన్ లివర్‌లో శరీరానికి ఉపయోగపడే జింక్, కాపర్ ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.

ఎంజైమ్‌ల పనితీరు మెరుగుపరిచి, వివిధ రసాయన ప్రక్రియలను సమతుల్యం చేయడంలో మటన్ లివర్ ఉపయోగపడుతుంది. మటన్ లివర్ లో శరీరానికి అవసరమైన విటమిన్ బీ12 కూడా ఎక్కువగా ఉంటుంది. మటన్ లివర్ రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు నరాల బలహీనత వంటి సమస్య నుంచి బయటపడేలా చేయడంలో తోడ్పడుతుంది.

కండరాల పెరుగుదలకు మటన్ లివర్‌లోని ప్రోటీన్ ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు. అందుకే కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు మటన్ లివర్ తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిదని వైద్యులు వెల్లడిస్తున్నారు. కిడ్నీల సమస్యలతో బాధ పడేవాళ్లు వైద్యుల సలహాలను పాటిస్తూ మటన్ లివర్ తినాల్సి ఉంటుంది. మటన్ లివర్‌లో ఎన్ని పోషకాలు ఉన్నప్పటికీ మితంగా తినాలని వైద్యులు చెబుతున్నారు.