మనలో ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు కావాలని కలలు కంటూ ఉంటారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఆ కలను నెరవేర్చుకోవడం సాధ్యం కావడం లేదని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సులువుగా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుందట. కోటీశ్వరులు కావాలని అనుకునే వాళ్లు ప్రధానంగా సేవింగ్స్ పై దృష్టి పెడితే మంచిది.
ఇప్పుడు తక్కువ మొత్తంలో పొదుపు చేసే డబ్బు భవిష్యత్తులో ఎక్కువ మొత్తం రాబడిని అందిస్తుంది. మొదట పొదుపు చేసి మిగిలిన డబ్బును ఖర్చు చేస్తే మంచిది. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా వేర్వేరు స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ధనవంతుడు కావాలనే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో లాభాలను పొందవచ్చు. ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా డబ్బు విషయంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. పొదుపు, పెట్టుబడులను క్రమంగా పెంచడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అదనపు ఆదాయ మార్గాలను సైతం ఏర్పరచుకోవడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు.
బంగారంపై డబ్బును ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందవచ్చు. చిన్నచిన్న చిట్కాలను పాటించడం ద్వారా పెద్దపెద్ద లక్ష్యాలను సులువుగా సాధించడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేలా పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.