టాలీవుడ్ యూత్‌స్టార్ సిద్ధు జొన్నలగడ్డ, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘జాక్’ మూవీ ప్రస్తుతం మంచి హైప్‌లో ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధంగా ఉంది. పాటలు, టీజర్, ట్రైలర్‌లకు వచ్చిన స్పందనతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ రిలీజ్‌కు ముందు అంచనాలకు భంగం కలిగించే పరిస్థితి తలెత్తింది.
‘జాక్’ మూవీని నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు డ్యూయో.. గతంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘గాంధీవధారి అర్జున’ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఆ సినిమా తీవ్రంగా నిరాశపరిచి డిజాస్టర్ అయింది. ఫారిన్ బ్యాక్‌డ్రాప్, యాక్షన్ థ్రిల్లర్ హైప్ ఏదీ ఉపయోగపడలేదు. ఆ సినిమా వలన వచ్చిన నష్టాలు ఇప్పుడు ‘జాక్’ చిత్రానికి అడ్డంగా మారుతున్నాయి.
ఆ సమయంలో గాండీవధారి అర్జున సినిమాను కొన్న గోదావరి ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయినట్లు పేర్కొంటున్నారు. రికవరబుల్ అడ్వాన్స్‌పై సినిమా తీసుకున్నామని, కానీ ఇప్పటి వరకు తమ డబ్బులు రాకపోవడంతో ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించారు. సమస్యను పరిష్కరించేవరకు ‘జాక్’ మూవీ రిలీజ్‌కు అనుమతి ఇవ్వవద్దని వారు కోరారు. ఇది ప్రొడ్యూసర్లకు పెద్ద హెడ్‌ఎక్ అయ్యింది.
ఈ క్రమంలో ఈ వ్యవహారం సెటిల్ కాకపోతే ‘జాక్’ విడుదలపై అనిశ్చితి నెలకొననుంది. గోదావరి ఏరియా మాత్రమే కాదు, మరిన్ని బయ్యర్లు ఇలాగే ఫిర్యాదు చేస్తే రిలీజ్ ఆలస్యం కావచ్చు. నిర్మాతలు ఇప్పటికైనా పాత నష్టాలపై సెటిల్‌మెంట్ చేసుకుంటేనే ‘జాక్’ సినిమాకు హాయిగా మార్గం ఏర్పడుతుంది. లేకుంటే మంచి హైప్ ఉన్న సినిమా అప్రతిష్టకు గురయ్యే ప్రమాదం ఉంది.

