బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. ఇతర టెలీకం సంస్థలకు భారీ షాక్ తగిలిందా?

ప్రముఖ టెలీకాం సంస్థలలో ఒకటైన బీఎస్ఎన్ఎల్ ఇటీవల ఫోన్ రీఛార్జీ కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెస్తుండటం గమనార్హం. అత్యంత చౌక ధరకే సరికొత్త ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తెచ్చింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ ప్రకటనతో బీఎస్ఎన్ఎల్ ఇతర టెలీకాం సంస్థలకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వడం గమనార్హం. ఊరించే ఆఫర్లతో అతి తక్కువ సమయంలోనే దిగ్గజ టెలికాం ఆపరేటర్‌గా అవతరించిన జియోకు బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ భారీ షాకిస్తున్నాయి.

బీఎస్ఎన్ఎల్ టవర్ల సంఖ్య మరింత పెరగడంతో పాటు 5జీ అందుబాటులోకి వస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 70 రోజుల వ్యాలిడిటీతో 197 రూపాయల ప్లాన్ ను బీ.ఎస్.ఎన్.ఎల్ అందుబాటులోకి తెచ్చింది. 50 లక్షల మంది కొత్త వినియోగదారులు ఇటీవల బీ.ఎస్.ఎన్.ఎల్ లో చేరడం జరిగింది. రూ.200 లకే 70 రోజుల వ్యాలిడిటీ ప్రకటించి జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియాలకు భారీ షాక్ ఇచ్చింది.

నంబర్‌ను ఎక్కువ కాలం పాటు యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. వినియోగదారులు మొదటి 18 రోజులు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత ఉచిత కాల్‌లను పొందే ఛాన్స్ ఉండగా ఇన్‌కమింగ్ సేవలు పూర్తి 70 రోజులు యాక్టివ్‌గా ఉంటాయని చెప్పవచ్చు. ఈ ప్లాన్ ద్వారా మొత్తం 36 జీబీ డేటా అందుబాటులోకి వస్తుంది.

ఈ ప్లాన్ యొక్క మొదటి 18 రోజులకు రోజుకు 100 ఉచిత మెసేజ్ లను సైతం పొందే అవకాశాలు ఉంటాయి. సరసమైన ధరలకే బీ.ఎస్.ఎన్.ఎల్ కొత్త ప్లాన్స్ అందుబాటులోకి వస్తుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో బీ.ఎస్.ఎన్.ఎల్ మరింత వేగంగా అభివృద్ధి చెందాలనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.