ఉదయాన్నే అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి, ఇది మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది, కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌గా అన్నం తినడం మంచిది కాదు. అన్నం బదులు ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తీసుకుంటే త్వరగా జీర్ణమవుతుంది, కొద్దిగా తినగానే కడుపు నిండుగా ఉంటుంది. మధ్యాహ్నం అన్నం తినడం మంచిది, ముఖ్యంగా బ్రౌన్ రైస్, రెడ్ రైస్ లాంటి తృణధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
రాత్రి అన్నం తినడం వల్ల బరువు పెరగవచ్చు మరియు నిద్ర జీవక్రియకు అంతరాయం కలుగుతుంది. రాత్రి సమయంలో రోటీ లేదా చపాతీ తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఒకసారి వండిన అన్నాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు వేడి చేయడం కూడా ప్రమాదకరం అని చెప్పవచ్చు. మళ్లీ వేడిచేసిన అన్నం మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
సాధారణంగా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉదయాన్నే పెరుగు లేదా మజ్జిగ వేసుకొని తినే అలవాటు చాలా మందిలో ఉంటుంది. అయితే ఎక్కువగా శారీరక శ్రమ చేయని వాళ్లకు మాత్రం అన్నం తినడం ఏ మాత్రంఆరోగ్యకరం కాదు. అయ్తితే అప్పుడప్పుడూ ఉదయం సమయంలో అన్నం తీసుకున్నా ఆరోగ్యానికి నష్టం చేకూరే అవకాశం అయితే ఉండదని కచ్చితంగా చెప్పవచ్చు.
అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్నం త్వరగా జీర్ణమై శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ ను పెంచుతుంది. అన్నం తినేవాళ్లు ఎంచుకునే బియ్యం విషయంలో సైతం జాగ్రత్తలు తీసుకోవాలి. బరువు తగ్గాలని భావించే వాళ్లకు అన్నం ఏ మాత్రం ఆరోగ్యకరం కాదు.