సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఇవే.. సల్ఫర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే?

సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారాలలో వెల్లుల్లి, ఉల్లిపాయ, బ్రోకలీ, క్యాబేజీ, పాలు, పెరుగు, చేపలు, రొయ్యలు, పీతలు, ఎండిన పండ్లు, సోయాబీన్స్, కాయ ధాన్యాలు ఉన్నాయి. బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఆస్పరాగస్, లీక్స్, ముల్లంగి, టర్నిప్ టాప్స్, వాటర్‌క్రెస్ వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అరటి పండు, పుచ్చకాయ, కొబ్బరికాయ, ఎండిన పీచెస్, ఆప్రికాట్లు, సుల్తానాలు, అంజూర పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పెర్ల్ బార్లీ, ఓట్స్, గోధుమలు తినడం వల్ల శరీరానికి అవసరమైన సల్ఫర్ లభిస్తుంది. పాలు, పెరుగు, క్రీమ్ తీసుకోవడం ద్వారా కూడా సల్ఫర్ ను పొందవచ్చు. పీతలు, రొయ్యలు, చేపలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన సల్ఫర్ లభిస్తుందని చెప్పవచ్చు. వెల్లుల్లి, ఉల్లిపాయ, సోయాబీన్స్, కాయ ధాన్యాలు తీసుకోవడం ద్వారా కూడ సల్ఫర్ శరీరానికి లభించే ఛాన్స్ ఉంటుంది.

గుడ్లలో సల్ఫర్ ఎక్కువగా ఉండగా గుడ్లు తినడం వల్ల శరీరానికి ఇమ్యూనిటీ పవర్ లభించే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. చేపలను ఆహారంలో చేర్చడం ద్వారా కూడా శరీరానికి మేలు చేసే సల్ఫర్ చేకూరుతుంది. చికెన్, మాంసం ఎక్కువగా తీసుకుంటే కూడా అధిక మొత్తంలో సల్ఫర్ ను పొందే ఛాన్స్ ఉంటుంది. అల్లం తీసుకోవడం ద్వారా కూడా సల్ఫర్ లభిస్తుంది.

అల్లం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగాపడుతుంది. ఉల్లిపాయలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలో తగ్గిస్తాయి. వెలుల్లి తీసుకోవడం ద్వారా శరీరానికి మేలు కలుగుతుంది. క్యాలీఫ్లవర్ లో ఉండే సల్ఫర్ ప్రేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.