Sri Lanka: లంకను ఇంకా వీడని ఒకప్పటి ల్యాండ్‌మైన్లు భయం… అమెరికా బిగ్ ట్విస్ట్!

ఒకప్పుడు శ్రీలంకను భయపెట్టిన ఎల్‌టీటీఈ చరిత్రగా మిగిలినా, వారి విధ్వంసానికి గుర్తుగా ఆ దేశంలో ఇప్పటికీ ల్యాండ్‌మైన్లు భయానకంగా మిగిలిపోయాయి. ఎల్‌టీటీఈ అమర్చిన మందుపాతరలు ఇప్పటికీ ప్రజలకు ప్రాణహానిని కలిగిస్తుండటం ఆందోళన కలిగించే విషయం. ఈ మైన్లను పూర్తిగా తొలగించేందుకు శ్రీలంక ప్రభుత్వం గత కొంతకాలంగా కృషి చేస్తోంది.

ఈ కార్యక్రమానికి ప్రధానంగా అమెరికా సహకారం అందిస్తోంది. శాంతి సమాజాల సహకారంతో ప్రత్యేక ల్యాండ్‌మైన్ నిర్వీర్య దళాలు పని చేస్తున్నాయి. అయితే ఇప్పుడు అమెరికా ఈ ప్రాజెక్టుకు నిధులు నిలిపివేయాలని యోచిస్తోంది. దీంతో శ్రీలంక ప్రభుత్వం తీవ్ర సంక్షోభానికి లోనైంది. అమెరికా మద్దతు లేకుండా ఈ మైన్లను తొలగించడం చాలా కష్టమని అధికారులు అంటున్నారు.

2017 ఒట్టావా ఒప్పందంలో భాగంగా 2028 నాటికి దేశంలోని అన్ని ల్యాండ్‌మైన్లను తొలగించాలని శ్రీలంక లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పుడే నిధుల కొరత ఏర్పడితే ఆ గడువు సాధ్యం కాకపోవచ్చన్న భయం కలుగుతోంది. 2002లో మొదలైన ఈ ప్రక్రియలో ఇప్పటికే 11 దేశాలు సహకారం అందిస్తున్నా, పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చేది అమెరికానే. దీంతో ఇప్పుడు వారి వెనకడుగు వల్ల మొత్తం ప్రాజెక్టు మధ్యలో ఆగే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం దేశంలోని ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో ప్రజలు రోజువారీ జీవనంలోనూ ల్యాండ్‌మైన్ భయంతో జీవిస్తున్నారు. వ్యవసాయానికి వెళ్లే సమయంలోనూ, పిల్లలు ఆడేటప్పుడు కూడా ప్రమాదం తప్పదు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ల్యాండ్‌మైన్ పేలుళ్లతో ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా నిధులు నిలిపివేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. శ్రీలంక ప్రభుత్వం తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే, అంతర్జాతీయ సమాజాన్ని మరోసారి మెప్పించేందుకు యత్నిస్తోంది. ఇక ఈ చర్యల ఫలితం ఏం అవుతుందో చూడాలి.

అలేఖ్య పచ్చళ్ళ పత్తిగింజలు || Alekhya Chitti Pickles Audio Controversy EXPOSED || Telugu Rajyam