మనలో చాలామంది బాదంపప్పును ఎంతో ఇష్టంగా తింటారు. బాదం పప్పు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బాదంపప్పులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఎ, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె, ఎముకల ఆరోగ్యం, బరువు నిర్వహణ, చర్మం మరియు జుట్టు ఆరోగ్యం, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి బాదంపప్పులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.
ఈ కొవ్వులు మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సైతం ఎంతగానో సహాయపడతాయని చెప్పవచ్చు. బాదంపప్పులో అధిక ఫైబర్ మరియు ప్రోటీన్ కంటెంట్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, ఇది అతిగా తినడాన్ని నిరోధించి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. బాదంపప్పులో కాల్షియం మరియు ఫాస్పరస్ ఉంటాయి, ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బాదం పప్పులో విటమిన్ ఈతో పాటు ఇతర పోషకాలు చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.
బాదంపప్పులో విటమిన్ ఈ, ఇతర పోషకాలు అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయని చెప్పవచ్చు. బాదంపప్పు భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరుగుదలను అరికట్టడంలో సహాయపడుతుంది. అయితే బాదంపప్పుతో కలిసి కొన్ని ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. కొన్ని ఆహారాలను బాదం పప్పుతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది. పాల ఉత్పత్తులతో కలిపి బాదం పప్పులను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పవచ్చు.
బాదం పప్పుతో పాలకూర కలిపి తీసుకుంటే కిడ్నీలలో రాళ్లు ఏర్పడతాయి. బాదంతో కలిపి ప్రాసెస్ చేసిన చక్కెర తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. బాదంతో కలిపి సోయా ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. బాదంతో కలిపి ఎక్కువ సోడియం ఉన్న పదార్థాలను తీసుకోకూడదు. బాదం ఎక్కువగా తీసుకునే వాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి.