ఇప్పుడు టాలీవుడ్‌లోని పాన్ ఇండియా స్టార్ ఎవరు? అని అడిగితే తొలుత వచ్చే పేరు ప్రభాస్‌దే. ‘బాహుబలి’ తర్వాత దేశవ్యాప్తంగా ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వరల్డ్ వైడ్ అభిమానులు ఉన్న డార్లింగ్‌కి మూవీ అవకాశాలు వరుసగా వస్తూనే ఉన్నాయి. కానీ ఆయనకు ఒక్క స్పెషల్ క్వాలిటీ ఉంది.. అదే యాడ్స్ దూరంగా ఉండడం.
ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు కోట్ల రూపాయల బ్రాండ్ డీల్స్ చేసుకుంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటికీ ఒక్క బ్రాండ్‌కి కూడా అంగీకారం ఇవ్వలేదు. ఎంతోమంది ప్రముఖ కంపెనీలు.. కూల్ డ్రింక్ బ్రాండ్స్ నుంచి స్కిన్ కేర్ వరకు.. భారీ మొత్తాల్లో ఆఫర్ చేసినా, డార్లింగ్ మాత్రం “నో థాంక్స్” అని చెప్పేశారట.
ప్రభాస్ దృష్టంతా సినిమాలపైనే. ప్రస్తుతం రాజా సాబ్ (మారుతి దర్శకత్వంలో), హను రాఘవపూడి మూవీలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. దీంతో పాటు స్పిరిట్ (సందీప్ రెడ్డి వంగా), సలార్ సీక్వెల్ (ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో), కల్కి పార్ట్ 2 (నాగ్ అశ్విన్ దర్శకత్వంలో) వంటి భారీ ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలన్నీ కొత్తదనం, విభిన్నతతొ వచ్చే ఛాన్సుంది.
ఎవరి దారిన వారు నడవడం నేటి పరిస్థితుల్లో కామన్. కానీ డబ్బు కోసం అనవసరంగా పరుగు పెట్టకుండా.. తన ఫోకస్ పూర్తిగా సినిమాలపైనే ఉంచడం ప్రభాస్‌కి ప్రత్యేకతను ఇస్తోంది. అది చూసి అభిమానులు గర్వపడటమే కాదు, ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్ కూడా అవుతుంది. డార్లింగ్ ఎంపిక చేసిన ఈ దారి.. ఆయన నిజమైన డెడికేషన్‌కు నిదర్శనంగా చెప్పొచ్చు.