Heat Boils: సెగ గడ్డలు వేధిస్తున్నాయా? అయితే ఈ చిట్కాలు ఒకసారి ట్రై చేయండి..!

Heat Boils: సాధారణంగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. మెసేజ్ కాలంలో తరచూ వేధించే సమస్య లో సెగగడ్డలు సమస్య కూడా ఒకటి. వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల తరచూ సెగ గడ్డలు పుట్టి తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా వస్తుంటాయి. వేసవికాలంలో ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే తరచూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు,పండ్లు తీసుకోవాలి.

అంతేకాకుండా వేసవి కాలంలో మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థాలు,మలినాలు బయటకు పోతాయి. సెగ గడ్డలు వచ్చిన తర్వాత వాటిని తొలగించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించటం పాటిస్తే సరిపోతుంది. ఈ సెగ గడ్డలు తగ్గించడంలో వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల సెగ్గడ్డ ఉన్న ప్రదేశంలో వెల్లుల్లిని మెత్తగా రుబ్బి అంటించాలి. ఇలా మూడు రోజుల పాటు చేయటం వల్ల సెగ గడ్డలు తగ్గిపోతాయి.

కలబంద గుజ్జులో కొంచెం పసుపు కలిపి సెగ గడ్డలు ఉన్న ప్రదేశంలో రాయటం వల్ల కూడా వాటి నుండి విముక్తి కలుగుతుంది. అలాగే బంగాలదుంపలు మెత్తగా తురిమి అందులో ఉన్న రసాన్ని పిండాలి. కొంచం దూది తీసుకొని ఆ రసం లో ముంది సెగ గడ్డ ఉన్న ప్రదేశంలో ఉంచాలి . 4 రోజుల పాటు ఉదయం, సాయంత్రం ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.