సాధారణంగా కొత్త పర్సు కొనుగోలు చేసినప్పుడు.. చాలా మంది పాత పర్సును వెంటనే పక్కన. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది పెద్ద తప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్సు కేవలం డబ్బు పెట్టుకునే వస్తువే కాదు, అది మన ఆర్థిక పరిస్థితిని, సంపదను ప్రతిబింబించే సాధనమని చెబుతున్నారు. కాబట్టి కొత్త పర్సు వాడే ముందు, పాత పర్సుతో ఒక ప్రత్యేకమైన పరిహారం చేయడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.
ముందుగా పాత పర్సును పూర్తిగా శుభ్రం చేయాలి. అందులో ఉన్న డబ్బు, కార్డులు, రసీదులు అన్నీ జాగ్రత్తగా బయటకు తీసేయాలి. తరువాత ఒక ఎర్రటి గుడ్డలో ఒక రూపాయి నాణెం, కొద్ది బియ్యం గింజలు పెట్టి చిన్న మూట కట్టాలి. ఈ మూటను పాత పర్సులో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ మూటను కొత్త పర్సులోకి మార్చాలి. ఇలా చేయడం వల్ల పాత పర్సులో ఉన్న శుభశక్తులు, సంపద కొత్త పర్సులోకి మారతాయని విశ్వసిస్తున్నారు.
అలాగే చిరిగిన పర్సును ఎప్పటికీ ఇంట్లో ఉంచుకోవద్దని వాస్తు చెబుతుంది. ఇది రాహువు ప్రభావాన్ని పెంచి ఆకస్మిక ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిరిగిన పర్సును కుట్టి బాగు చేసి, ఎర్రటి గుడ్డలో చుట్టి సేఫ్‌లో భద్రపరచాలి. మరీ మిగతా పర్సులు ఎప్పటికీ ఖాళీగా ఉండకూడదు. అందులో కనీసం ఒక నాణెం లేదా కొద్దిపాటి బియ్యం అయినా ఉండాలి. ఎందుకంటే ఖాళీ పర్సు అశుభ సూచికంగా పరిగణించబడుతుంది.
వాస్తు నిపుణుల ప్రకారం, పర్సులో ఎప్పటికీ అనవసరమైన బిల్లులు, రసీదులు, చిరిగిన పేపర్లు పెట్టరాదు. ఇవి దోషాలను ఆకర్షించి ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటాయని చెబుతున్నారు. అదేవిధంగా, ఎరుపు, పసుపు, పచ్చ రంగు పర్సులు సంపదకు శుభప్రదమని నమ్మకం. నల్ల లేదా గోధుమ రంగు పర్సులు వాడితే డబ్బు నిల్వ కష్టమవుతుందని భావిస్తున్నారు. మొత్తం మీద, పర్సును కేవలం డబ్బు పెట్టుకునే వస్తువుగా కాకుండా సంపదకు ప్రతీకగా భావించి వాస్తు సూచించిన చిన్న చిట్కాలు పాటిస్తే, ఆర్థిక జీవితంలో శాంతి, స్థిరత్వం ఏర్పడుతుందని పండితుల అభిప్రాయం. (గమనిక: ఈ కథనం పండితుల అభిప్రాయం ప్రకారం రాసినది దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
