AP Politics: సనాతన ధర్మాన్ని రక్షించే స్వామి పై కక్ష్య సాధింపా… టీటీడీ నిర్ణయం పై అంబంటి ఫైర్?

AP Politics: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ గా బిఆర్ నాయుడు ఎంపికైన విషయం మనకు తెలిసిందే. ఇటీవల ఆయన మొదటి పాలకమండలి సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ తిరుమలలో అమలు పరచబోయే కొన్ని కీలక నిర్ణయాలను తెలియజేశారు. అయితే ఈ టీటీడీ నిర్ణయాల వెనుక టిడిపి నేతల ఆలోచన విధానం కూడా ఉందని అంబంటి రాంబాబు ఫైర్ అయ్యారు.

గతంలో చంద్రబాబు నాయుడుకి కొమ్ముకాస్తున్న బి.ఆర్ నాయుడు చంద్రబాబు ఏది చెబితే తన టీవీలో అదే ప్రచారం చేశారు. అందుకు దక్షిణగా చంద్రబాబు నాయుడు బిఆర్ నాయుడుకి తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్గా బాధ్యతలను అప్పగించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే అక్కడ పాలన జరుగుతోందని మండిపడ్డారు.

ఇటీవల బిఆర్ నాయుడు సరికొత్త నిర్ణయాలను తెలియజేస్తూ.. తిరుపతిలో శ్రీ వాణి ట్రస్ట్ రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే శారద పీఠ మఠాలను కూడా కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాలపై అంబంటి రాంబాబు మాట్లాడుతూ మండిపడ్డారు.తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న నిర్ణయాలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయి. అసలు బోర్డు ఏర్పాటు రాజకీయ ప్రేరేపితంగా జరిగింది.

శ్రీవాణి ట్రస్టును రద్దు చేయడం దారుణం. శ్రీవాణి ట్రస్టులో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ట్రస్ట్ పై విచారణ కూడా జరిపించారు కానీ విచారణలో ఏమి తేలలేదు.వైఎస్‌ జగన్‌ హయాంలోనే శ్రీవాణి ట్రస్ట్ రూపకల్పన జరిగింది కాబట్టి కక్ష కట్టి ట్రస్ట్‌ను రద్దు చేశారు. శారదా పీఠం స్వరూపానంద స్వామిపై చంద్రబాబు నాయుడు, లోకేష్ కక్ష కట్టారు. స్వరూపానంద స్వామి ధర్మ ప్రచారం చేసే వ్యక్తి.

వైయస్సార్ హయామంలోనే తిరుమల కొండపై స్వరూపానంద స్వామికి కేటాయించిన స్థలాన్ని ఇప్పుడు రద్దు చేశారు. స్వరూపానంద స్వామి పైన ప్రభుత్వానికి ఎందుకంత కక్ష?. మీ రెడ్ బుక్ లో మనుషులు మాత్రమే కాకుండా స్వామీజీలు, భక్తులు కూడా ఉన్నారా?. సనాతన ధర్మాన్ని కాపాడే స్వామీజీపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్న చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదంటూ ఈ సందర్భంగా అంబంటి రాంబాబు వరుసగా ప్రశ్నలు వేశారు.