YS Jagan: జైలులో బాబు నరకం.. లైవ్ లో జగన్ ఆనందం… అరెస్టు వెనుక పెద్ద కుట్ర జరిగిందా?

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా 2023 సెప్టెంబర్ 9వ తేదీ చంద్రబాబు నాయుడుని అరెస్టు చేస్తూ రాజమండ్రి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు జైలులో క్షణక్షణం అనుభవిస్తున్న నరకాన్ని జగన్మోహన్ రెడ్డి లైవ్ లో చూస్తూ ఎంజాయ్ చేశారు అంటూ ఒక టీడీపీ అనుకూల టీవీ మీడియాలో డిబేట్ నడచింది. దాని మీద విచారణ జరిపించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి.

ఇలా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన తర్వాత జైలులో ప్రతిక్షణం ఏం జరుగుతుందనే సమాచారం జగన్మోహన్ రెడ్డికి వెళ్తోంది అలాగే అక్కడ జరుగుతున్న దృశ్యాలు అన్నింటిని కూడా ఆయన లైవ్లో చూస్తూ ఆనందించేవారని అందుకు తగిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని మీడియా ప్రచారం చేసింది. మాజీ సీఎం జగన్‌కు అప్పట్లో నలుగురు పోలీసు అధికారులు, ఒక రాజకీయ నాయకుడితో కూడిన బృందం ప్రతి ఆదివారం జైలులో చంద్రబాబు కార్యకలాపాలకు సంబంధించిన విషయాలన్నింటినీ వివరించేవారు.

చంద్రబాబు-పవన్ కళ్యాణ్, చంద్రబాబు-భువనేశ్వరి-లోకేష్-బ్రహ్మణి తదితరుల సంభాషణలు కూడా రాజమండ్రి జైలులో ఉన్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులు ఆ విషయాలని కూడా జగన్మోహన్ రెడ్డికి చేరవేశారని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే వైకాపా మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత తెదేపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం అసెంబ్లీలో బాబు అరెస్టు విషయంలో కుట్ర జరిగిందని చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.

వైసీపీ హయాంలో చంద్రబాబు మీద మహా కుట్ర జరిగిందని దానిని మీద విచారణ జరిపించాలని ఆయన కోరారు. బాబు పైన ఆనాటి వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులను పెట్టి తనని అరెస్టు చేయించారని ఈ విషయంపై హోం శాఖ విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలి అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. మరి చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఇంకా ఎలాంటి నిజానిజాలు బయటకు వస్తాయో తెలియాల్సి ఉంది.