YS Jagan: వాలంటీర్ల తొలగింపు పై స్పందించిన జగన్.. పక్క ఆధారాలతో బయటపెట్టిన జగన్!

YS Jagan: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతభత్యాలు ఐదువేల నుంచి పదివేలకు పెంచుతామని వాలంటీర్ వ్యవస్థను అలాగే కొనసాగిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ అసలు గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థ అధికారకంగా లేదని రెన్యువల్ చేయలేదని వారికి జీతభత్యాలు సెప్టెంబర్ లోని ఆగిపోయాయి అంటూ వెల్లడించారు.

ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థ గురించి చంద్రబాబునాయుడు చేస్తున్న ఈ వ్యాఖ్యలకు జగన్ స్పందిస్తూ పక్క ఆధారాలను బయటపెట్టారు. చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు 2023 ఆగస్టులోనే జీతాలు నిలిపివేశారని చెప్పిన చంద్రబాబు ఈ సంవత్సరం వారి కోసం 277 కోట్లు విడుదల చేశారని ఎలా చెబుతున్నారు అంటూ ప్రశ్నించారు.

వాలంటీర్ల వ్యవస్థకు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు చెల్లించిన జీత భత్యాల వివరాలను వైఎస్ జగన్ వెల్లడించారు. ఏ ప్రభుత్వమైనా ఇలా జీతాలు ఇవ్వాలంటే బడ్జెట్ ఆమోదం లేకుండా ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా ఎలా జీతాలు చెల్లిస్తారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం హెడ్ ఆఫ్ అకౌంట్ లేదని అబద్దాలు చెబుతున్నారని మండిపడటమే కాకుండా హెడ్ ఆఫ్ అకౌంట్ కి సంబంధించిన పూర్తి వివరాలను కూడా జగన్ ఈ సందర్భంగా బయటపెట్టారు.

ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఆర్థిక శాఖ అనుమతితో ఐదు సంవత్సరాలుగా వాలంటీర్లకు జీతాలు చెల్లిస్తున్నామని అయితే ప్రస్తుతం వారికి జీతాలు చెల్లించలేక చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన మాట తప్పడం బాబుకి అలవాటు అందుకే గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థ అనేది అధికారికంగా లేదని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు అంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.