Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులకు వరుసగా వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు. గత 10 సంవత్సరాల కాలంలో ఏ నాయకుడు ఎంత సొమ్ము దోచుకున్నారు ఎక్కడ స్కాములు చేశారో అనే విషయాలన్నింటిపై ఈయన ఆరా తీస్తూ వారి అరెస్టులకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇకపోతే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు పై కూడా ఈయన సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇలా అభివృద్ధి పనులు చేస్తుంటే బిఆర్ఎస్ నాయకులు కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారు అంటూ ఆరోపణలు చేశారు. ఈ పదేండ్ల కాలంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఏం వెలగబెట్టారని ప్రశ్నించారు. పదేండ్ల పాటు అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపినోడు 10 నెలలు కాకుండానే మమ్మల్ని అధికారంలో నుంచి దిగి పొమ్మంటున్నారు.
రంగనాయకసాగర్ వద్ద హరీశ్‌రావు ఫామ్‌హౌస్ కట్టుకున్నారని, భూ సేకరణ కోసం తీసుకున్న భూమిని తన పేరు మీదకు రాయించుకున్నారని మండిపడ్డారు. హరీష్ రావు తన ఫామ్ హౌస్ కి ముందు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలట అందుకోసమే సాగర్ కోసం తీసుకున్న భూములను ప్రాజెక్టు నుంచి తొలగించు వారి సొంతం చేసుకున్నారని తెలిపారు. హరీష్ రావు నువ్వేమీ దిగులు చెందొద్దు నీ లెక్కలు నేను తేలుస్తా అన్ని బయటకు తీస్తున్నాననీ రేవంత్ హరీష్ రావుకి వార్నింగ్ ఇచ్చారు.
ఇక కేటీఆర్ గురించి కూడా ఈయన మాట్లాడుతూ.. కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ కోసం అని ఈయన తెలిపారు. కెసిఆర్ ఫామ్ హౌస్ కి కాలవలు తీయడానికి కొన్ని వేలకోట్ల రూపాయలు ఖర్చుచేసి నీ ఫామ్ హౌస్ కి నీళ్లు తీసుకెళ్తావా.. ఇది ఎక్కడి న్యాయం కెసిఆర్ నీకు తగునా అంటూ వరుసగా ఈయన బిఆర్ఎస్ నాయకులపై మండిపడుతూ వారు చేసిన అవినీతినీ బయటపెట్టారు.