Revanth Reddy: తెలంగాణలో లగచర్ల గ్రామ ఘటన సంచలనంగా మారింది. లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. అయితే ఈ విషయాన్ని బిఆర్ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్న పరిశ్రమలు రావడం ఎంతో అవసరం. పరిశ్రమలు రావాలి అంటే తప్పనిసరిగా భూమి కేటాయించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం గడ్డి మొలక కూడా మొలవని లగచర్ల గ్రామంలో భూ సేకరణ చేస్తే తప్పేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఈ కుట్రలో భాగంగా లగచర్ల గ్రామంలో అధికారులపై దాడి జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వ హయామంలో భూసేకరణ చేపట్టలేదా మీరు చేస్తే రైటు మేము చేస్తే తప్పా. గ్రామాల్లో మనకు ఉన్నా ఆత్మ గౌరవం భూమి అనే విషయం నాకు తెల్వదా.. కానీ భూ సేకరణ లేకుండా పరిశ్రమలు ఎలా ఏర్పాటు చేస్తారు. అభివృద్ధి జరగాలి అంటే ఎవరో ఒకరు భూ త్యాగం చేయాల్సిందేనని రేవంత్ తెలిపారు.
ఇలా భూసేకరణలో భాగంగా భూమిని కోల్పోయిన వారికి మూడు రెట్ల అధిక ధరతో డబ్బును చెల్లిస్తున్నాము.కేటీఆర్ ఉరుకులాటను గమనిస్తూనే ఉన్నా.. ఇంకా ఎంత దూరం ఉరుకుతారో చూస్తా. భూ సేకరణలో కుట్ర చేసినందుకు కేటీఆర్ ఊచలు లెక్కపెట్టాల్సిందే అంటూ రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
ఇక ఈ లగచర్ల ఘటనలో భాగంగా కొంతమంది రౌడీషీటర్ లను పిలిపించి కేటీఆర్ వారి చేత అధికారులపై దాడి చేయించారని తెలియజేశారు. ఈ విషయంలో కేటీఆర్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎవరైతే తెలంగాణ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తారో వారు తప్పకుండా ఊచలు లెక్క పెట్టాల్సిందే అంటూ మరోసారి టిఆర్ఎస్ నాయకులకు రేవంత్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.