తనకి ఓటు వెయ్యొద్దంటున్న బిగ్ బాస్ నిఖిల్.. అంతలోనే కప్పుతోనే వస్తానంటూ స్టేట్మెంట్!

బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు జరగని విధంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో ప్రస్తుతం ఉన్న ఇంటి సభ్యులను నామినేట్ చేయించారు బిగ్ బాస్ టీం. 12వ వారం ఎలిమినేషన్స్ రెండు రోజులపాటు జరిగిన సంగతి తెలిసిందే. ఈవారం ఎలిమినేషన్స్ లో నిఖిల్, పృద్వి, ప్రేరణ, యష్మీ, నబీల్ ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్స్ లో నిఖిల్ పై సీత చేసిన కామెంట్స్ అటు హౌస్ లోనూ ఇటు బయట కూడా గట్టిగానే రచ్చ లేపాయి.

అంతేకాకుండా నిఖిల్ చాలా గట్టిగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ ని వాడుకొని వాళ్లని గేమ్ ఆడకుండా చేసి నువ్వు గెలవాలని చూస్తావు అంటూ నిఖిల్ పై సీత చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.అయితే నిఖిల్ అప్పుడు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కానీ పృథ్వి దగ్గర ఈ మాటలు చెప్పి ఎమోషనల్ అయ్యాడు, సీత ఎందుకు అలా చెప్పిందో అర్థం కాలేదంటూ వాపోయాడు.

తనకి ఇక హౌస్ లో ఉండాలని లేదని తాను బయటికి వెళ్లిపోతాను అంటూ బిగ్ బాస్ కి చెప్పాడు. తనకి ఆడియన్స్ ఎవరు ఓట్లు వేయొద్దని ఈ వారం హౌస్ నుంచి వెళ్ళిపోయేందుకు రెడీగా ఉన్నానని కూడా చెప్పాడు నిఖిల్. అంతేకాదు నామినేషన్స్ లో సీత చెప్పినట్లు స్ట్రాంగ్ ఉమెన్ ని వాడుకొని తను గేమ్ లో గెలవాలని అనుకోలేదని, నేను ఉన్నంతవరకు మనసుకి ఏం అనిపిస్తుందో అలాగే ఆడాను, నేను ఒకరిని తొక్కి వాడుకొని ఈ షో గెలవాలని ఇక్కడికి రాలేదు.

నన్ను ఇప్పటివరకు సేవ్ చేసి, నన్ను ఇష్టపడి ఓట్ చేసిన వారందరికీ థాంక్యూ సో మచ్.. నాకు తెలిసి నా ప్రయాణం అయిపోయింది, నాకు నిజంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది అని చెప్పాడు కానీ కాసేపటికే నబీల్, పృధ్వీ నిఖిల్ లో కాస్త జోష్ నింపటంతో మరొకసారి కెమెరా ముందుకు వచ్చి ఇంకా మంచిగా ఆడి నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. మీ సపోర్ట్ ఎప్పుడూ కావాలి, నేను బయటకు వెళ్ళిపోతాను అన్నందుకు సారీ, నా బెస్ట్ గేమ్ నేను ఆడతాను ఈవారం నామినేషన్ లో ఉన్నాను, గట్టిగా ఆడతాను కప్పు తీసుకొని బయటికి వస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.