ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఐడీబీఐ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ల భర్తీ దిశగా ఈ సంస్థ అడుగులు వేస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. మొత్తం 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ల ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. నవంబర్ 30వ తేదీ ఈ ఉద్యోగ ఖళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్ని, కొచ్చి, ముంబై, నాగ్ పూర్, పుణె, ఇతర లొకేషన్లలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఒ జనరల్ ఉద్యోగ ఖాళీలు 500 ఉండగా అగ్రి అసెట్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఉద్యోగ ఖాళీలు 100 ఉన్నాయి. అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
2024 సంవత్సరం అక్టోబర్ 1 నాటికి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 6.5 లక్షల రూపాయలకు అటూఇటుగా వేతనం లభిస్తుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈరోజు నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాగా 2025 జనవరిలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష జరిగే ఛాన్స్ ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.