Telangana: వారు కూడా సర్పంచ్ పోటీకి అర్హులే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఈ క్రమంలోనే మరి కొద్ది రోజులలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇప్పటికే పంచాయతీలలో పాలన ముగిసి కూడా దాదాపు సంవత్సరం అవుతున్న తరుణంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం కోసం రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

పంచాయతీ చట్టం ప్రకారం సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేసే వారికి కేవలం ఇద్దరు పిల్లలు మాత్రమే కలిగి ఉండాలి అలాంటి వారు మాత్రమే ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు.ప్రస్తుతం చట్టం ప్రకారం జూన్ 1, 1995 తరువాత మూడో సంతానం ఉన్న వ్యక్తులు పోటీ చేసేందుకు అనర్హులుగా పరిగణించబడ్డారు. దాంతో ముగ్గురు పిల్లలు ఉన్న వారంతా ఇప్పటివరకు సర్పంచ్ పదవి పోటీలకు దూరంగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా రేవంత్ సర్కార్ ఈ చట్ట సవరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్‌గా అందరికీ ఈ అవకాశాన్ని కల్పించాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ముందుగా సమగ్ర కుటంబ రాజకీయ, ఆర్థిక సర్వే పూర్తి చేయబోతున్నారు. ఆ వెంటనే, బీసీ జనాభా లెక్కింపు, రిజర్వేషన్లను ఫైనల్ ఆయన తర్వాత ఈ చట్ట సవరణ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఇక సర్పంచులపై అధికారం కలెక్టర్లకు గత ప్రభుత్వం ఇచ్చింది సర్పంచులపై వేటు వేసే అధికారం కలెక్టర్లకు ఇవ్వడం ఏంటని,ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచులపై కలెక్టర్లు వేటు వేసే నిబంధనను కూడా రేవంత్ రెడ్డి తొలగించబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే త్వరలో జరగబోయే ఈ సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయడానికి ముగ్గురు పిల్లలు కూడా అర్హులని త్వరలోనే ప్రకటించబోతున్నారు.