AnilKumar Yadav: నేను వైసీపీ పార్టీనే కాదు.. జగన్ కు షాక్ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్?

AnilKumar Yadav: వైకాపా నాయకుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైకాపా పార్టీ కార్యకలాపాలకు కూడా కాస్త దూరంగా ఉన్నారు. ఈయన వైసిపి ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వార్తలలో నిలిచిన అనిల్ కుమార్ యాదవ్ ఒక్కసారిగా సైలెంట్ కావడంతో కేవలం అరెస్టు భయంతోనే సైలెంట్ అయ్యారని వార్తలు వచ్చాయి.

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎంతోమంది వైకాపా నాయకులు జనసేన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ సైతం వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన గురించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలాగే మీడియా వారు ఎన్నో వార్తలను ప్రచారం చేశారు. నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని టిడిపిలోకి వెళ్తున్నానని జనసేనలోకి వెళ్తున్నానని చాలామంది ఎన్నో రకాల వార్తలు రాశారు. అయితే నా గురించి ఇలాంటి వార్తలు రాస్తే వారికి కాస్త డబ్బులు వస్తాయి వారికి మంచి ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఇలాంటి వార్తలు తప్పకుండా రాయండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

నేను ఏ పార్టీలోకి వెళ్లడం లేదు అలాగే నేను వైసీపీ పార్టీ కూడా కాదని తెలిపారు.నేను కేవలం జగనన్న పార్టీ అని తెలిపారు. ఆయన ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను ఈ విషయం మా బాస్ కి ఎప్పుడో తెలుసు. ఇక ఈ ఐదు నెలల పాటు నేను నా వ్యక్తిగత కారణాలు కొన్ని వ్యక్తిగత సమస్యల వల్ల సైలెంట్ గా ఉన్నాను త్వరలోనే మేము కూడా ప్రజల ముందుకు వస్తామని తెలిపారు. ఇక నన్ను అరెస్టు చేయాలని కొంతమంది స్థానిక నేతలు బాగా ఒత్తిడి తెస్తున్నారు అరెస్టులకు కూడా నేను భయపడనని ఎంతోమంది పెద్దపెద్ద ముఖ్యమంత్రులే జైలుకు వెళ్లొచ్చారు. మనం జైలుకు వెళ్తే తప్పేంటి అంటూ ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.