AP Politics: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా రోడ్లపై చాలా విమర్శలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రాంతంలో కూడా రోడ్లు వేసిన పాపాన పోలేదని రోడ్లలో ప్రయాణించాలి అంటే ఎంతో ఇబ్బందికరంగా ఉందని ఎన్నో సెటైర్లు కూడా పేల్చారు. ఇలా రోడ్లన్నీ గుంతలు పడి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది.
ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతలను పూడ్చడానికి సుమారు 850 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు ఇక కొత్త రోడ్లు వేయాలి అంటే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయి కనుక అంత బడ్జెట్ లేదని చంద్రబాబు నాయుడు తెలిపారు. మన దగ్గర డబ్బు లేకపోయినా ఆలోచనలు ఉన్నాయని కొత్త రోడ్లు కావాలి అంటే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఇద్దామన్నది ఆ ప్రతిపాదన.
ఆ విధంగా చేస్తే కనుక రోడ్లు బంగారంగా తయారు అవుతాయి కానీ టోల్ ఫీజు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇలా టోల్ ఫీజ్ గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాయకులదేనని వారు ఓకే అంటే ఈ ప్రతిపాదన ముందుకు వెళుతున్న లేకపోతే గుంతల రోడ్లపైనే ప్రయాణించాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు తెలిపారు..
ఇక గ్రామాలలో మండలాలలో అసలు టోల్ ఫీజు అన్నదే ఉండదని మరో మినహాయింపు ఇచ్చారు అలాగే టోల్ ఫీజ్ కేవలం కార్లు, లారీలు బస్సులకు మాత్రమే వర్తిస్తుందని ట్రాక్టర్లు ఆటోలు బైకులకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. అయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన ఆ ఫీజు సామాన్యుడు పైనే పడుతుంది. తద్వారా బస్సు చార్జీలను కూడా పెంచే అవకాశాలు ఉంటాయని మరికొందరు ఈ ప్రతిపాదనపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అంటే ప్రతి రూపాయి ప్రజల వద్ద నుంచి తీసుకొని అభివృద్ధి చేయడం ఏంటని సంపద సృష్టించడం అంటే ఇదే నా బాబు అంటూ మరికొందరు కూడా ఈయన వ్యాఖ్యలపై వ్యతిరేకత చూపుతున్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి కూడా ఒక శాతం జీఎస్టీ పెంచాలని కోరడం పట్ల కూడా వ్యతిరేకత చూపుతున్నారు. ఇలా జిఎస్టి పెంచితే సామాన్య ప్రజలపై అధిక భారం పడుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.