Pawan Kalyan: మరో పదేళ్లపాటు మా బాబుగారి సీఎం.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 150 రోజులను పూర్తి చేసుకుంది. ఈ 150 రోజుల పాలన గురించి శాసనసభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి అన్ని రంగాలలో మొదలైందని తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం పథకానికి తన సూచనల మేరకు డొక్కా సీతమ్మ గారి పేరును పెట్టినందుకు చంద్రబాబు నాయుడుకు పవన్ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ రెండు చేతులు జోడించి నమస్కరించారు.

ఒక క్లిష్ట పరిస్థితులలో నాయకుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారని కొనియాడారు. ఇటీవల విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో ఆయన ఆఫీసులోనే కూర్చొని అధికారులకు ఆదేశాలు జారీ చేసే స్థాయిలో ఉన్నారు కానీ అలా చేయకుండా ప్రజలకు ధైర్యం నింపడానికి నీటి ప్రవాహంలోనూ బురదలోను రాత్రి పగలు అనగా ప్రజలకు ధైర్యం చెబుతూ తిరిగారని తెలిపారు.

ఇలాంటి ఎన్నో విషయాలలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పవన్ తెలిపారు. ఎప్పుడైనా ఒక రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్లాలి అంటే అనుభవం కలిగిన నాయకులు ఎంతో అవసరమని పవన్ తెలిపారు.అనుభవం ఉన్న చంద్రబాబు పాలనలో ఏపీ అతివేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. తమ ప్రభుత్వంలో నెల మొదటి రోజున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు గుర్తు చేశారు.

ఇక సోషల్ మీడియా వేదికగా బూతు పోస్టులు చేసే వారిని అణిచివేసే విషయంలో చంద్రబాబు నాయుడు హోం మంత్రి అనిత తీసుకున్న నిర్ణయం అభినందనీయమని తెలిపారు. ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తూ ప్రజలకు మేలు చేసే ఓ మంచి నాయకుడు మరో 10 సంవత్సరాల పాటు సీఎం గా కొనసాగాలి అంటూ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.