Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హనుమకొండలో ఏర్పాటుచేసిన ప్రజా పాలన విజయోత్సవ సభ కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అలాగే బిఆర్ఎస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది మహిళల ప్రభుత్వమని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్క మహిళను కోటీశ్వరురాలిని చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.
గత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేయలేదని, ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే కుట్రలు చేస్తున్నారని తెలిపారు. కెసిఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని అందరూ కలలు కంటున్నారు. కెసిఆర్ అనే మొక్కను తెలంగాణ గడ్డపై మొలకెత్తనివ్వను అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తీవ్రస్థాయిలోకి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బిడ్డా రేవంత్… బీఆర్ఎస్ చెట్టును ఎలా మొలవనివ్వవో మేము చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు మార్పులు చోటు చేసుకున్న అయితే కొన్ని నిర్ణయాల కారణంగా కొన్ని ప్రాంతాలలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకత కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మూసీ ప్రక్షాళన విషయంలో రేవంత్ రెడ్డి పై ప్రజలలో కూడా కాస్త వ్యతిరేకత ఉంది అయితే ఈయన చేసేది మంచి కోసమేనని మరికొందరు రేవంత్ రెడ్డికి పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారు.